Begin typing your search above and press return to search.
జెట్ ప్యాక్ దుస్తుల్లో భారత జవాన్.. సరికొత్త ప్రయత్నం..!
By: Tupaki Desk | 14 Feb 2023 10:30 AM ISTఒకప్పుడు జరిగిన యుద్ధాలకు ప్రస్తుత కాలంలో జరుగుతున్న యుద్ధాలకు చాలా తేడా ఉంది. తాజాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య నడుస్తున్న వారే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. ఉక్రెయిన్-రష్యా వార్లో డ్రోన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం సైతం రష్యా లాంటి ఆయుధ సంపత్తి ఉన్న దేశాన్ని ఎదుర్కొ కలుగుతుందంటే దానికి కారణం అత్యాధునిక టెక్నాలజీనే.
అంతేకాకుండా ఎప్పటికపుడు ఆయుధాలను అప్డేట్ చేసుకోవడం వల్లనే ఉక్రెయిన్ దేశం రష్యాతో ఢీ అంటే ఢీ అంటోంది. యాంటీ మిస్సైల్ రాకెట్స్.. డ్రోన్స్.. క్షిపణులతోనే రష్యా బలగాలు ఉక్రెయిన్ లో దక్కించుకున్న భూభాగాలను తిరిగి విడిపించుకోగలిగింది. ఇక వింటర్ సీజన్లలో ఆయా దేశాల సైనికులు ధరిస్తున్న ప్రత్యేక దుస్తులు సైతం యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో భారత్ జవాన్లకు సైతం అత్యాధునిక దుస్తులను అందజేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. చైనాతో ఇటీవల కాలంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్న నేపథ్యంలోనే ఆ ప్రాంతంలోని జవాన్ల కోసం జెట్ ప్యాక్స్ దుస్తులను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే బెంగూళూరు వేదిక ఈనెల 17 నుంచి యలహంకలోని ఎయిర్ పోర్టు వేదికగా ఎయిర్ షో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బెంగూళూరు వెళ్లారు. ఈ షోలో అమెరికా సైతం పాల్గొనబోతుంది. రక్షణ.. వాణిజ్య రంగాల్లో భారత్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి ఈ ఎయిర్ షో ఎంతగానో ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది.
కాగా ఈ ఎయిర్ షో లో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా స్టాల్ ను నెలకొల్పింది. ఇందులో రక్షణ రంగంలో కొనసాగుతున్న దేశీయ స్టార్టప్స్ తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే జెట్ ప్యాక్ ధరించిన భారత ఆర్మీ జవాన్ ఎలా ఉంటాడనేది చూపించగా అందరికీ ఆకర్షిస్తుంది. ఇలాంటి మోడల్ జవాన్ ను విడుదల చేయడం భారత్ కు ఇదే తొలిసారి.
ఈ జెట్ ప్యాక్స్ ను ఇప్పటికే అమెరికా.. యూకే వినియోగిస్తున్నాయి. మన సైన్యాన్ని ఆధునికీకరించడంలో భాగంగా కేంద్రం సైతం జెట్ ప్యాక్ సూట్‌లను కొనుగోలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈమేరకు ఇప్పటికే ఓ సంస్థతో కాంట్రాక్ట్ ను కుదుర్చుకుందని సమాచారం. త్వరలోనే వీటిని రక్షణ శాఖ సైనికులకు అందజేసే అవకాశం ఉంది.
తొలుత నార్తరన్ సెక్టార్ లో చైనాతో వెంబడి పహారా కాసే సరిహద్దు భద్రత జవాన్లకు ఈ జెట్ ప్యాక్ సూట్స్ ను రక్షణ శాఖ అందజేయనుంది. ఈ జెట్ ప్యాక్స్ సినిమాల్లో చూపించిన వాటికంటే చాలా అత్యాధునికమైనవి. వీటిని ధరించడానికి కూడా శిక్షణ అవసరం కానుంది. కిష్టమైన భూభాగాల్లో గస్తీని పెంచేందుకు ఇవి ఎంతగానో దోహద పడనున్నాయని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.