Begin typing your search above and press return to search.

ఇండియా vs చైనా ఎవరి బలాబలాలు ఎంత?

By:  Tupaki Desk   |   17 Jun 2020 6:47 PM GMT
ఇండియా vs చైనా ఎవరి బలాబలాలు ఎంత?
X
భారత్ - చైనా లు భద్రతా బలగాలు - ఆయుధాల విషయంలో పోటీ పడుతున్నాయి. చైనా వద్ద 157 ఫైటర్ జెట్లు ఉంటే భారత్ వద్ద 270 ఫైటర్ జెట్లు ఉన్నాయి. యుద్ధ ట్యాంకుల విషయానికి వస్తే భారత్ వద్ద 4292 ట్యాంకులు ఉండగా చైనా వద్ద 3500 ట్యాంకులు ఉన్నాయి. ఇక న్యూక్లియర్ వెపన్స్ విషయానికి వస్తే చైనా దగ్గర 104 వెపన్స్ ఉండగా భారత్ వద్ద 8 అగ్ని -3 లాంచెర్స్ ఉన్నాయి. ఇవి అన్ని చైనాను టార్గెట్ చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి.

హెలిక్రాప్ట్రలు: భారత్ -722 - చైనా - 911
కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ : భారత్ - 538 - చైనా 1232
ఆయుధాలతో కూడిన వాహనాలు : భారత్ - 8686 - చైనా 33000
రాకెట్ ప్రొజెక్టర్లు: భారత్ -266 - చైనా - 2650
ఎయిర్ క్రాఫ్టులు: భారత్ - 2123 - చైనా -3210
దాడి చేయగల హెలీ కాఫ్టర్లు: భారత్ - 81 - చైనా - 281
సబ్ మెరైన్లు: భారత్ - 16 - చైనా - 74

ఇక బడ్జెట్ విషయానికి వస్తే :

బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ శాఖకు సంభందించి భారత్ - చైనా ల మధ్య చాల వ్యత్యాసం ఉంది. భారత్ తన బడ్జెట్ లో (దాదాపు) రూ. 2.95 లక్షల కోట్లను రక్షణ రంగానికి కేటాయిస్తే చైనా రూ. 11.38 లక్షల కోట్లను కేటాయిస్తోంది. ఇది దాదాపు భారత రక్షణ రంగానికి కేటాయించే మొత్తానికి నాలుగు రెట్లుగా (దాదాపు) ఉంటోంది. చైనా తన బడ్జెట్ లో రక్షణ శాఖకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగా భారత్ మాత్రం చైనా తో పోలిస్తే తక్కువ ప్రాధాన్యతనిస్తోంది