పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి ప్రసంగించారు. ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైందని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి జరుగుతోందని తెలిపారు. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయన్నారు. భారత్ మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తోందని తెలిపారు. పేదరికం లేని భారత్ నిర్మాణం కోసం కృషి జరుగుతోందన్నారు.
భారత డిజిటల్ నెట్వర్క్ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరణగా నిలిచిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. దళితు లు గిరిజనులు బలహీనవర్గాల కోసం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా నిరం తర పోరాటం సాగుతోందన్నారు. డిజిటల్ ఇండియా దిశగా భారత్ ముందుకెళ్తోందన్న రాష్ట్రపతి సాంకే తికతను అందిపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. పేదల ఆలోచన స్థాయిని కూడా పెంచుతున్నామని రాష్ట్రపతి తెలిపారు.
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రస్తావించారు. తమ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వంటి మెరుగైన పథకాలు తీసుకు వచ్చిందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామన్నారు. అవినీతి రహిత వ్యవస్థలను రూపొందిస్తున్నామని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగుతోందన్నారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచామని తెలిపారు.
బినామీ ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలు తీసుకున్నామని రాష్ట్రపతి పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్నారు. కరోనా కష్టకాలాన్ని అధిగమించడంలో స్థిరమైన ప్రభుత్వం కృషిచేసిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు ట్రిబుల్ తలాక్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకు న్నామని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాబోయే పాతికేళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు పడాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
ప్రపంచమంతా భారత్ వైపు ఆశావహ దృక్పథంతో చూస్తోందన్నారు. నూతన సాంకేతికత ఆధారంగా పౌరులకు సేవలందుతున్నాయని తెలిపారు. అభివృద్ధితో పాటు ప్రకృతిని కాపాడుతున్నామని తెలిపారు. మాది ప్రజల ఆత్మవిశ్వాసం పెంచే ప్రభుత్వమని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. సర్జికల్ స్ట్రైక్ ద్వారా సరిహద్దులు దాటిన ముష్కర మూకలను మట్టుబెట్టామన్నారు. దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిర్భవిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.