చైనాకి చెక్ పెట్టడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం ..ఏంటంటే ?

Sat Oct 17 2020 20:00:20 GMT+0530 (IST)

India to check china


గత కొన్ని రోజులుగా చైనాతో సరిహద్దు వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటివరకు స్నేహ పూర్వకంగా మెలుగుతూ వచ్చిన భారత్ గాల్వానా లోయ ఘటన తర్వాత చైనా కి చెక్ పెట్టె దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. . ఇప్పటికే పలు చైనీస్ యాప్‌లను నిషేధించిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. న్యూస్ అగ్రిగేటర్లు న్యూస్ ఏజెన్సీలు 26 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పాటించాల్సి ఉంటుందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. సదరు సంస్థ సీఈఓ ఒక భారతీయ పౌరుడై ఉండాలి. 60 రోజులకు పైగా పనిచేసే విదేశీ ఉద్యోగులందరికీ సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం ఉంటుందంటూ ప్రభుత్వం కొన్ని నియమాలను సూచించింది.అలాగే ఎవరైనా విదేశీయులు 60 రోజులకు మించి ఇక్కడ ఉండాల్సి వస్తే వారికి సెక్యూరిటీ క్లియరెన్స్ అనివార్యమని కొన్ని కఠినతరమైన నియమ నిబంధనలకు సర్క్యులర్ లో పొందు పరిచింది. 26 శాతం ఎఫ్ డీఐ నిబంధనను అమలు చేయడం ద్వారా భారత్ లో పని చేస్తున్న డిజిటల్ మీడియాలో పెట్టుబడులు పెడుతున్న చైనా ఇతర విదేశీ కంపెనీలపై చెక్ పెట్టడం ప్రభుత్వానికి వీలవుతుంది. డైలీ హంట్ హలో యుఎస్ న్యూస్ ఒపెరా న్యూస్ న్యూస్ డాగ్ వంటివి ప్రస్తుతం మన దేశంలో ఉన్న కొన్ని చైనీస్ విదేశీ నియంత్రిత డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్.  ఇలాంటి డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ 2016లో జరిగిన అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికలను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో భారతదేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నియమాలను అమలు చేయాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో డీపీఐఐటీ "తగిన సంప్రదింపుల తరువాత ప్రభుత్వ మార్గం ద్వారా 26 శాతం ఎఫ్‌డీఐని అనుమతించే నిర్ణయం" రిజిస్టర్ చేయబడిన భారతదేశంలో ఉన్న లేదా భారతీయసంస్థలకు చెందిన కొన్ని "వర్గాలకు వర్తిస్తుందని" స్పష్ట చేసింది. స్వావలంబన బాధ్యతాయుతమైన డిజిటల్ న్యూస్ మీడియా పర్యావరణ వ్యవస్థను స్థాపించే లక్ష్యంతో ఈ నియమాలు తీసుకువచ్చారు. సంస్థ బోర్డులో మెజారిటీ డైరెక్టర్లు భారత పౌరులుగా ఉండటం వంటి కొన్ని షరతులకు కంపెనీ కట్టుబడి ఉండాలి; చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక భారతీయుడే ఉండాలి. ఈ నిర్ణయం భారతీయ ప్రయోజనాలకు పక్షపాతం లేని నిజమైన ఎఫ్‌డీఐ పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుంది