Begin typing your search above and press return to search.

డ్రాగన్ కు ధీటుగా స్పందించిన భారత్

By:  Tupaki Desk   |   21 Nov 2020 10:10 AM GMT
డ్రాగన్ కు ధీటుగా స్పందించిన భారత్
X
సరిహద్దులో ప్రాణాలకు తెగించి కాపలా కాస్తున్న సైన్యానికి అవసరమైన స్మార్టు టెంటులను అందించటంలో చైనాకు ధీటుగా కేంద్రప్రభుత్వం కూడా స్పందించింది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా సోలార్ పవర్ తో పనిచేసే టెంట్లను సైన్యానికి సమకూర్చింది కేంద్రం. తూర్పు లడ్డాఖ్ తో పాటు వాస్తవాధీన రేఖ వెంబడే మన సరిహద్దుల్లో వేలాది మంది సైనికులు 24 గంటలు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపలా కాస్తున్నారు. ఎంత అప్రమత్తంగా ఉంటున్నా ఒకవైపు చైనా సైనికులు మరోవైపు దాయాది దేశం పాకిస్ధాన్ సైన్యంతో పాటు ఉగ్రవాదులు కూడా మనదేశంలోకి చొరబడుతున్నారు. అవసరం లేకపోయినా రెండు దేశాల సైనికులు కాల్పులు జరుపుతున్నారు.

ఇదంతా ఇంతవరకు జరిగిన విషయం. సరిహద్దుల్లో అసలైన సమస్య ఇపుడు మొదలైంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు లడ్డాఖ్ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తుంది. హియాలయ పర్వత ప్రాంతాలతో పాటు మంచులోయల్లో కూడా మన సైన్యం కాపలా కాయాల్సిందే. నవంబర్ నుండి జనవరి మద్యలో ఈ ప్రాంతంలో చలి మైనస్ 40 డిగ్రీల వరకు నమోదవ్వటం ఇక్కడ చాలా సహజం. ఇంత చలిలో విధులు నిర్వర్తించాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదు.

ఇటువంటి వాతావరణాన్ని తట్టుకునేందుకు చైనా సైన్యం సోలార్ పవర్ తో పనిచేసే టెంట్లను తన సైన్యానికి అక్టోబర్లోనే అందించింది. అయితే ఇంతకు ముందు మన ప్రభుత్వం ఇటువంటి టెంట్లను అందించటానికే ప్లాన్ చేసినా ఆలస్యమైంది. మొత్తానికి నవంబర్ మొదటి వారంలో సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైన్యానికి వందల సంఖ్యలో టెంట్లను కేంద్రం అందించింది. టెంటు లోపలంత సోలార్ పవర్ వల్ల విద్యుత్ 24 గంటలు పనిచేస్తునే ఉంటుంది. సైనికులు పడుకునే పరుపులు, తాగే నీరు, టెంటులోపలంతా విద్యుత్ హీటర్ల వల్ల వెచ్చగా ఉంటుంది.

చివరకు ఆయుధాలు పెట్టుకునే లాకర్లు, బట్టలు పెట్టుకునే కబ్బోర్డులు కూడా టెంట్లలో వెచ్చగానే ఉంటాయి. ఆయుధాలపై మంచు పేరుకుపోకుండా ప్రత్యేకమైన పాలిష్టర్ పొరను సైన్యానికి అందించింది. ఈ ప్రత్యేక టెంట్ల కారణంగా తినే ఆహారాన్ని కూడా అవసరానికి తగ్గట్లు వేడి చేసుకోవచ్చు. ఇప్పటివరకు చలికాలం వస్తోందంటే మన సైన్యం నానా అవస్తలు పడేది. అలాంటిది ఇక నుండి చలిపులిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మొత్తానికి దేశంలోని ప్రజల ప్రాణాలను కాపాడే సరిహద్దులోని సైన్యానికి కేంద్రం ఎన్ని సౌకర్యాలు కల్పించినా తప్పేలేదు.