Begin typing your search above and press return to search.

చౌక తయారీ.. ఇండియా నెం.1, చైనా నెం.2

By:  Tupaki Desk   |   30 May 2023 6:00 PM GMT
చౌక తయారీ.. ఇండియా నెం.1, చైనా నెం.2
X
కొన్నాళ్ల క్రితం చైనాలో జనాభా ఎక్కువగా ఉండటంతో పాటు అనేక కారణాల వల్ల వస్తువుల తయారీ అనేది అక్కడ చాలా తక్కువ ఖర్చుకు తయారు అయ్యే మౌళిక వసతులు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చైనాలో పని చేసే వారి సంఖ్య తగ్గుతోంది. అంతే కాకుండా తక్కువ పారితోషికంకు పని చేసే వారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు.

చిన్న పనికి కూడా అక్కడ వర్కర్లు పెద్ద మొత్తంలో పారితోషికంను డిమాండ్‌ చేస్తున్నారు. ఇక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కాస్ట్‌ ఆఫ్ మేకింగ్‌ చైనాలో భారీగా పెరిగింది. తాజాగా వరల్డ్‌ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల జాబితాను సదరు సంస్థ విడుదల చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా తయారీ లో ఖర్చు తక్కువ అయ్యేది ఇండియాలో అంటూ సదరు సంస్థ పేర్కొంది. తక్కువ పారితోషికం కు పని చేసే వారు చాలా మంది ఇండియాలో ఉన్నారు. అంతే కాకుండా మౌలిక వసతులు కూడా ఇండియాలో భారీగా ఉన్నాయి.

ఒకప్పుడు చైనాలో ఏ వస్తువు అయినా చాలా తక్కువ రేటుకు అయ్యేది. కానీ ఇప్పుడు మేక్ ఇన్‌ ఇండియా పోగ్రాం కారణంగా కూడా ఈ జాబితాలో ఇండియా మొదటి స్థానంకు వచ్చి ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వేలాది వస్తువులను ప్రపంచంలో అత్యంత చౌకగా ఇండియాలో తయారు చేసే అవకాశం ఉందని వరల్డ్‌ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంస్థ పేర్కొంది. ప్రపంచంలోనే వస్తువులను చౌకగా తయారు చేసే దేశాల జాబితాలో ఇండియా నెం.1 గా ఉండగా చైనా రెండవ స్థానంలో నిలిచింది. వియత్నాం లో కూడా చౌకగా వస్తువుల తయారీ జరుగుతుందట.

దాంతో మూడవ స్థానంలో వియత్నాం దేశం నిలిచింది. 50 దేశాల జాబితాలో సెర్బియా 49వ స్థానంలో మరియు బెలారస్ 50 స్థానంలో ఉన్నాయి. ముందు ముందు ఇండియా మరింత చౌకగా ప్రపంచానికి వస్తువులు ఇచ్చే మౌలిక సామర్థ్యం ను పెంచుకోవడం మాత్రమే కాకుండా రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో మ్యాన్ పవర్ కూడా భారీగా పెరుగుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.