Begin typing your search above and press return to search.

చైనాకు చెక్: భారత్-ఆస్ట్రేలియా కీలక ఒప్పందం

By:  Tupaki Desk   |   4 Jun 2020 5:29 PM GMT
చైనాకు చెక్: భారత్-ఆస్ట్రేలియా కీలక ఒప్పందం
X
హిందూ మహాసముద్రాన్ని అంతా గుప్పిటపట్టి అన్ని దేశాల్లోనూ సైనిక తీరస్థావరాలను అభివృద్ధి చేస్తూ పక్కలో బల్లెంలా తయారవుతున్న చైనాకు చెక్ పెట్టడానికి భారత్-ఆస్ట్రేలియా ఒక్కటైంది. వర్చుమల్ మీటింగ్ ద్వారా సమావేశమైన భారత ప్రధాని నరేంద్రమోడీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెక్ పెట్టేందుకు రవాణా కోసం ఒక దేశ సైనిక స్థావరాలను మరో దేశం వాడుకునేలా ఒప్పందం చేసుకున్నారు.

హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధ నౌకల ప్రాబల్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ రీజియన్ లో కలిసి పనిచేయాలని భారత్-ఆస్ట్రేలియా నిర్ణయించాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందామని.. పరస్పరం సహకరించుకుందామని ఆస్ట్రేలియా ప్రధానికి సూచించారు. వర్చువల్ సమ్మిట్ ను నూతన మోడల్ గా.. వాణిజ్య నిర్వహణలో కొత్త శకంగా మోడీ అభివర్ణించారు.

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయులు ముఖ్యంగా విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నందుకు ఆస్ట్రేలియా ప్రధానిని మోడీ అభినందించారు.

ఇక మోడీ నిర్మాణాత్మకంగా.. చాలా సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాని మోడీకి మారిసన్ కితాబిచ్చారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మరింత సంబంధాలను బలోపేతం చేస్తామని తెలిపారు.