Begin typing your search above and press return to search.

అచ్చెన్న విషయంలో పెరిగిపోతున్న టెన్షన్

By:  Tupaki Desk   |   14 Sep 2021 5:31 AM GMT
అచ్చెన్న విషయంలో పెరిగిపోతున్న టెన్షన్
X
తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవహారంపై టెన్షన్ పెరిగిపోతోంది. ఆ మధ్య అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై నోటికొచ్చినట్లు మాట్లాడారు లేండి. అందుకనే అచ్చెన్నపై చర్యలు తీసుకోవాలంటు ప్రివిలేజ్ కమిటీకి స్వయంగా స్పీకరే చెప్పారు. దాంతో ప్రివిలేజ్ కమిటీ అచ్చెన్నకు నోటీసులిచ్చింది. పోయిన నెల 31వ తేదీనే కమిటి సమావేశం జరగాల్సుంది. అయితే వ్యక్తిగతంగా తాను హాజరు కాలేకపోతున్నట్లు అచ్చెన్న కమిటీకి లేఖ రాశారు.

అచ్చెన్న లేఖను చూసిన తర్వాత సమావేశాన్ని ఈనెల 14వ తేదీన అంటే ఈరోజుకు వాయిదా వేసింది. ఎట్టి పరిస్ధితుల్లోను సమావేశానికి వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందే అని కమిటీ అచ్చెన్నను హెచ్చరించింది. నిజానికి ఒకటి రెండు అవకాశాలిచ్చి కమిటి తనకిష్టం వచ్చిన నిర్ణయం తీసేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యబద్దంగా వెళ్ళాలన్న ఏకైక కారణం తోనే కమిటి పదే పదే అచ్చెన్నకు నోటీసులు ఇస్తోంది. మరి ఈరోజు అచ్చెన్న కమిటీ ముందుకు స్వయంగా హాజరవుతారా లేదా అన్నదే ఆసక్తిగా మారింది.

ఇలాంటి విషయమే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు విషయంలో కూడా జరుగుతోంది. రామానాయుడు విషయాన్ని వదిలేసినా నిమ్మగడ్డ విషయం ఎంత వివాదాస్పదమైందో అందరు చూసిందే. లేని అధికారాలను చేతిలోకి తీసుకుని నిమ్మగడ్డ ఇద్దరు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిలకు గృహనిర్భందం విధించారు. మీడియాతో మాట్లాడకూడదనే షరతు కూడా విధించటం అప్పట్లో సంచలనమైంది.

ఇది సరిపోదన్నట్లుగా ఇద్దరు మంత్రులపై గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ కూడా ఫిర్యాదుచేశారు. మంత్రులిద్దరిపై వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందే అన్నారు. గవర్నర్ గనుక యాక్షన్ తీసుకోకపోతే తన పద్ధతిలో ప్రొసీడ్ అవుతానని గవర్నర్ కు రాసిన లేఖలో చెప్పడంపై పెద్ద వివాదమే రేగింది. తన పరిధి దాటి వ్యవహరించిన నిమ్మగడ్డపై మంత్రులిద్దరూ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదులు చేశారు. ఆ విషయం కూడా కమిటీ ముందు పరిశీలనలో ఉంది. వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని నోటీసులను నిమ్మగడ్డ లెక్క చేయడం లేదు. కాబట్టి ఈ విషయంపైన కూడా కమిటీ ఏమి యాక్షన్ తీసుకుంటుందో చూడాల్సిందే.