ఐటీ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్!

Sun Jul 05 2020 11:00:02 GMT+0530 (IST)

Income Tax Department Extends Deadline for Filling IT Returns

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. కరోనా లాక్ డౌన్ తో ఆదాయం లేక ఆపసోపాలు పడుతున్న ఉద్యోగులు ప్రజల బాధలు అర్థం చేసుకున్న కేంద్రం తాజాగా వారికి గుడ్ న్యూస్ చెప్పింది.2019-20 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించిన ఐటీ రిటర్నుల దాఖలు చేసే గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆదాయపన్నుశాఖ ప్రకటించింది. రెండు రోజుల క్రితమే ఐటీ రిటర్న్ ల గడువును ఈనెల 31కి పెంచిన కేంద్రం తాజాగా మరో 4 నెలలు అవకాశం ఇచ్చింది.

టీడీఎస్ టీసీఎస్ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ఆఖరు తేదిని కూడా ఐటీ శాఖ ఆగస్టు 15 దాకా పెంచింది.  ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా నవంబర్ 30దాకా రిటర్న్ ల దాఖలుకు అవకాశం కల్పిస్తున్నామని ఐటీశాఖ వెల్లడించింది.

ఐటీ కడుతున్నప్పుడు హౌసింగ్ లోన్లు జీవిత భీమా పీపీఎఫ్ ఇతరత్రా మినహాయింపులను క్లెయిమ్ చేసుకొనే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.. వీటి కింద ఈనెల 31వ తేదీదాకా చేసిన అన్ని రకాల ముదుపులను 2019-20 రిటర్నులలో క్లెయిమ్ చేసుకోవచ్చు.