ఏపీలో మరోసారి కేబినెట్ విస్తరణకురంగం రెడీ అవుతోంది. గత ఏడాది ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని రెండో సారి విస్తరించిన సీఎం జగన్.. దీనిని ఎన్నికల మంత్రివర్గంగా పేర్కొన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో మంత్రి వర్గం పనిచేయాలని.. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ఆయన కాంక్షించారు. అయితే.. ప్రస్తుతం మార్చిన మంత్రి వర్గం ఆశించిన విధంగా పనిచేయడం లేదు.
దీంతో మరోసారి మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇదే విషయంపై.. గవ ర్నర్ అబ్దుల్ నజీర్తోనూ ఆయన మంతనాలు పూర్తి చేశారని సీఎంవో వర్గాల ద్వారా వినిపిస్తున్న కథనం. ఎన్నికలు చాలా హాట్గా మారడం.. మరోవైపు.. ప్రజల్లోనూ ప్రస్తుత మంత్రులపై అవినీతి ఆరోపణలు పెల్లుబుకుతుండడంతో వచ్చే ఎన్నికల నాటికి.. పార్టీని ప్రభుత్వాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలని సీఎం భావిస్తున్నారు.
ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లోనే అంటే.. శుక్రవారమే మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఉన్న అంచనాల మేరకు మరోసారి ఫైర్ బ్రాండ్కొడాలి నానికి అవకాశం ఇవ్వనున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే వరుసలో బాలినేని శ్రీనివాసరెడ్డి తోట త్రిమూర్తులుకు కూడా జగన్ అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. వీరితో పాటు నెల్లూరులో తలెత్తిన రాజకీయ మంటలను కూడా అదుపు చేయాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్రెడ్డికి కూడా.. సీఎం జగన్ మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుండడం గమనార్హం. దీంతో నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేయనున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.