Begin typing your search above and press return to search.

4 వేవ్ లు చూసిన ఆ దేశంలో.. కొవిడ్ కొత్త వేరియంట్

By:  Tupaki Desk   |   17 March 2023 5:00 PM GMT
4 వేవ్ లు చూసిన ఆ దేశంలో.. కొవిడ్ కొత్త వేరియంట్
X
సరిగ్గా మూడేళ్లవుతోంది లాక్ డౌన్ ప్రకటించి.. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ కాలంలో ఎవరూ కలలోనూ ఊహించని లాక్ డౌన్ ను నిజం చేసింది కొవిడ్ వైరస్. దీని దెబ్బకు దేశాలకు దేశాలే హడలిపోయాయి. కొన్ని దేశాలయితే సంవత్సరాల తరబడి సరిహద్దులను మూసివేశాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచం నార్మల్ లైఫ్ లోకి వస్తోంది. ప్రజలు కూడా కొవిడ్ భయం నుంచి బయటపడుతున్నారు. దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుటపడుతున్నాయి. కంపెనీల నిర్వహణ కుదురుకుంటోంది.

ప్రపంచమంతా వణికింది.. కొవిడ్ తీవ్రతకు ప్రపంచం చిగురుటాకులా వణికింది. ఎంతో ఉన్నతమైన జీవన ప్రమాణాలు, ఆరోగ్య వసతులు ఉండే అమెరికాలోనే 10 లక్షల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంగ్లండ్ లో ఏకంగా ప్రధానే ఐసీయూ వరకు వెళ్లొచ్చారు. భారత్ లాంటి దేశంలో తొలి విడత 2020 మార్చి నుంచి జూన్ వరకు లాక్ డౌక్ కొనసాగింది. తర్వాత అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, ఇదే సమయంలో మన దేశంలో డెల్టా వైరస్ పుట్టుకొచ్చింది. తీవ్రత పరంగా అత్యంత ప్రమాదకరమై డెల్టా లక్షలాది ప్రాణాలు బలిగొంది. భారత్ లోనే డెల్టా ధాటికి 5 లక్షల మంది వరకు చనిపోయినట్లు అంచనా. ఇక ప్రపంచ వ్యాప్తంగానూ ఈ లెక్క పెద్దగానే ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు.

చిన్న దేశం.. నాలుగు వేవ్ లు ప్రపంచంలోని చాలా దేశాలు రెండో, మూడో కొవిడ్ వేవ్ లు చూశాయి. కానీ.. ఇజ్రాయిల్ మాత్రం నాలుగు వేవ్ లు చవిచూసింది. వాస్తవానికి ఇజ్రాయిల్ చాలా చిన్న దేశం. దాని జనాభా 95 లక్షలు. అయితే, వైద్య వసతులు మెరుగు. డెవలప్ మెంట్ లోనూ ఇజ్రాయిల్ మిగతా దేశాలకు ఆదర్శం. ఇక ఇజ్రాయిల్ లో టీకా మూడు డోసులే కాక నాలుగో డోసు కూడా వేశారు. ఇదీ ఆ దేశం పరిస్థితి. అలాంటిచోట తాజాగా కొత్త వేరియంట్ పుట్టింది. బీఏ.1, బీఏ.2 వేరియంట్ల రీకాంబినెంట్. బెన్ గురియెన్ విమానాశ్రయంలో చేసిన వైద్య పరీక్షల్లో ఇద్దరు ప్రయాణికుల్లో ఈ వేరియంట్ ను గుర్తించారు. ఇప్పుడీ వేరియంట్ ఆనుపానులను గుర్తించే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.

ప్రమాదం కాదు.. ముప్పు లేదని చెప్పలేం కొవిడ్ లో అనేక వేరియంట్లు పుట్టకొస్తుంటాయి. వైరస్ స్వభావంలో ఇది సహజం. అయితే, అన్ని వేరియంట్లూ ప్రమాదకరం కాదు. అలాగని తేలిగ్గా తీసుకోవాలని కూడా చెప్పలేం. ఉదాహరణకు చైనాలోని వూహాన్ లో పుట్టిన కొవిడ్ వేరియంట్ తొలినాళ్లలో చాలా స్ట్రాంగ్. అదే వేరియంట్ యథాతథంగా వ్యాపించి ఉంటే చాలా ప్రమాదం జరిగేది. కానీ, కాస్త బలహీనపడి వ్యాపించింది. మరోవైపు భారత్ లో పుట్టిన డెల్టా అత్యంత డేంజర్ అయితే వ్యాప్తి వేగం తక్కువ. ఇక దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమైక్రాన్ వ్యాప్తి వేగం ఎక్కువ. కానీ, తీవ్రత తక్కువ. కాగా, ఒమైక్రాన్ వచ్చి ఏడాదిపైగా అవుతోంది. ఆ తర్వాత మళ్లీ ఏ వేరియంట్ గురించి కూడా ప్రముఖంగా, ప్రమాదకరమని వార్తలు రాలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.