గాడ్సేను కీర్తించారు.. మహాత్మాగాంధీ దిష్టిబొమ్మను కాల్చేశారు

Tue Jan 31 2023 16:07:03 GMT+0530 (India Standard Time)

In Praise of Nathuram Godse Mahatma Gandhi Was Burnt

దేశంలో దేశభక్తులను తగులబెడుతున్నారు. దేశ ద్రోహులని అనే వారిని నెత్తిన పెట్టుకుంటున్నారు. మత చాంధసవాదంతో చెలరేగిపోతున్న కొందరు అల్లరిమూకల వల్ల సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఎదురవుతోంది.మహాత్మాగాంధీ.. మన జాతిపిత. జాతియావత్తు ఆయనకు రుణపడి ఉండాలి. అలాంటి గాంధీని కూడా కొందరు విద్వేశంతో అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక బాధాకరమైన చర్యలో  ఆర్ఎస్ఎస్ అనుకూల మద్దతుదారులు గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను కీర్తిస్తూ.. మహాత్మాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సంఘటన సోమవారం గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసిన ఈ వీడియో అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులు గాడ్సేను కీర్తిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. వారు దిష్టిబొమ్మకు గాంధీ చిత్రం యొక్క ఫ్లెక్సీని కట్టారు. గాడ్సేకు అనుకూలంగా నినాదాలు చేసిన తర్వాత.. గాంధీ దిష్టిబొమ్మను వారు దహనం చేశారు. ఆర్ఎస్ఎస్ అనుకూల మద్దతుదారులు గాడ్సేకు మద్దతుగా నినాదాలు చేస్తూనే ఉన్నారు.

ఇది నిజంగా అసహ్యకరమైన సంఘటనగా చెప్పొచ్చు. దీనిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకోలేదు. ఈ విషయంలో పోలీసులు స్పందించాలని చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేసి ట్యాగ్ చేస్తూ పోలీసులను కోరుతున్నారు.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.