Begin typing your search above and press return to search.
ఇమ్రాన్ మాజీ భార్యకు మళ్లీ పెళ్లి.. వరుడు ఎవరంటే?
By: Tupaki Desk | 24 Dec 2022 9:05 AM ISTపాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి.. ఒకప్పటి పాక్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ఇమ్రాన్ ఖాన్ వివాహమాడిన రేహమ్ ఖాన్ గుర్తున్నారు కదా? ఆమె తాజాగా పెళ్లి చేసుకున్నారు. జర్నలిస్టుగా పని చేస్తూ.. ఇమ్రాన్ ఖాన్ ను ఇంటర్వ్యూ సందర్భంగా మొదలైన పరిచయం పెళ్లి వరకు వెళ్లటం.. ఇమ్రాన్ భార్యగా పది నెలలు మాత్రమే ఉన్న ఆమె.. తర్వాతి కాలంలో అతడ్ని విభేదిస్తూ విడిపోవటం తెలిసిందే. 49 ఏళ్ల రేహమ్ ఖాన్ కు తాజాగా జరిగినది మూడో పెళ్లి కాగా.. ఆమె పెళ్లాడిన వ్యక్తి సినీ నటుడు కమ్ మోడల్ గా వ్యవహరించిన మీర్జా బిలాల్ బేగ్.
అయితే.. అతడి వయసు 36 ఏళ్లు మాత్రమే. తనకంటే దాదాపు పదమూడేళ్ల చిన్నవాడిని రేహమ్ ఖాన్ పెళ్లాడారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వీరిద్దరికి ఇది మూడో పెళ్లి కావటం. తాజాగా తన పెళ్లి గురించి ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వీరిద్దరు రెండు చేతులు పట్టుకొని.. తమ రింగ్స్ ప్రముఖంగా కనిపించేలా ఫోటోను పోస్టు చేశారు.
తన కొడుకు.. మీర్జా తల్లిదండ్రుల ఆశీస్సులతో అమెరికాలోని సీటెల్ లో తమ వివాహం జరిగినట్లుగా పేర్కొన్నారు. జస్ట్ మ్యారీడ్ అంటూ పోస్టుపెట్టటంతో పాటు.. ఫోటోల్ని షేర్ చేశారు. తాను నమ్మదగిన వ్యక్తి ఇన్నాళ్లకు దక్కినట్లుగా ఆమె పేర్కొన్నారు. రేహమ్ ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. పాకిస్థానీ - బ్రిటిష్ జర్నలిస్టుఅయిన రేహమ్ 2015లో ఇమ్రాన్ ను పెళ్లాడటం ద్వారా ఒక్కసారి వార్తల్లోకి వచ్చారు. కేవలం వారి వివాహ బంధం పది నెలలు మాత్రమే సాగింది.
1973లో లిబియాలో రేహమ్ ఖాన్ జన్మించారు. ఆ తర్వాత ఇంగ్గండ్ లో బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుగా కెరీర్ ను షురూ చేశారు. 2012లో పాకిస్థాన్ వెళ్లిన ఆమె.. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఇమ్రాన్ ను కలిశారు. తర్వాత వారిద్దరి మనసులు కలిసి పెళ్లాడారు. ఆ తర్వాత తనపై దుష్ప్రచారం సాగినట్లుగా ఆరోపిస్తూ.. ఇమ్రాన్ తో బంధాన్ని తెంచుకున్నారు. అయితే.. ఆమె తన మూడో పెళ్లి విషయాన్ని గతంలోనే వెల్లడించారు.
గత జులైలో ఒక పాకిస్థానీ యూట్యూబ్ చానల్ షో కోసం గెస్టుగా పాల్గొన్న ఆమె.. ఆ సందర్భంగా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. తనకు మళ్లీ ప్రేమ లభించిందని.. తాను మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లుగా తన కుటుంబ సభ్యుల్లో ఒకరైన జ్యోతిష్యుడు చెప్పినట్లుగా పేర్కొన్నారు. కట్ చేస్తే.. తాజాగా పెళ్లాడారు.
గతంలో సినీ నటుడిగా.. మోడల్ గా వ్యవహరించిన మీర్జా బిలాల్ బేగ్ ప్రస్తుతం కార్పొరేట్ ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నారు. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న వీరిద్దరి బంధం ఎలా ఉంటుందన్నది కాలమే సరిగా చెప్పగలదు. ఏమైనా.. నూతన దంపతులకు ఆల్ ద బెస్టు చెప్పేద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.