ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రాణభయం తొలగినట్టే .. !

Thu May 13 2021 05:00:01 GMT+0530 (IST)

If you take that vaccine, the fear of death will be removed

కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ ద్వారానే అంతం చేయగలం అని పలువురు చెప్తున్నారు . ఈ నేపథ్యంలో చాలా దేశాలు వివిధ రకాల వ్యాక్సిన్ల వినియోగానికి అత్యవసర అనుమతులు మంజూరు చేశాయి. మన దేశంలో కోవాగ్జిన్ కోవిషీల్డ్ టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. అయితే ఇవి రెండూ అత్యవసర వినియోగం కింద అనుమతులు పొందాయి. దీంతో వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య ఎంత తేడా ఉండాలనే అంశంపై శాస్త్రవేత్తల ప్రయోగాలు పూర్తికాలేదు. కరోనా నుంచి రక్షించేందుకు ఆస్ట్రాజెనికా కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ డోసు సంజీవనిలా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్   వెల్లడించింది.  కోవిషీల్డ్  డోసు ఒక్కటి తీసుకుంటే 80 శాతం వరకు మరణం నుంచి రక్షణ లభిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఫైజర్ బయోఎన్ టెక్ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న తర్వాత 80 శాతం వరకు రెండో డోసు వేసుకున్న తర్వాత 97 శాతం వరకు ప్రాణాలు కాపాడుతుందని చెప్పింది.  డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు 28 రోజుల్లో కరోనాతో చనిపోయినవారి డేటాను పరిశీలించగా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు నిలుపుకున్నారని తెలిపింది. వ్యాక్సిన్ వేసుకోని వారికంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నవారు 55 శాతం మంది ఫైజర్ డోసు వేసుకున్నవారు 44 శాతం మంది మరణం నుంచి తప్పించుకుంటున్నారని వెల్లడించింది. కోవిడ్ బాధితులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోసు వేసుకోవడం ద్వారా 80 శాతం మరణం నుంచి రక్షణ పొందుతున్నారని పీహెచ్ఈ తన తాజా అధ్యయనంలో స్పషం చేసింది. ఇక ఫైజర్ బయోఎన్ టెక్ వ్యాక్సిన్ కోవిడ్ వచ్చే రెండు వారాల ముందు వేసుకున్నా మరణం నుంచి 69 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే 97 శాతం రక్షణ కల్పిస్తుందని పీహెచ్ ఈ  తెలిపింది.