ఆ రోబోలతో రొమాన్సు చేస్తే.. మగాళ్లతో చేయటానికి ఇష్టపడరట

Mon Sep 28 2020 14:00:20 GMT+0530 (IST)

If you have romance with robots you cant do it with humans

మారిన కాలానికి తగ్గట్లు అందివచ్చే టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కేలా చేస్తోంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. సెక్సుకు ఇచ్చే ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. ఆడ.. మగ అన్న తేడా లేకుండా సెక్సు కోసం తపిస్తున్న వైనం ఎక్కువ అవుతుంది. లైంగిక తృప్తి కోసం పడుతున్న ఆరాటం కూడా అంతకంతకూ పెరుగుతోంది. దీనికి నిదర్శనంగా ఇప్పటికే బయటకు వచ్చిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు కారణంగా డేటింగ్ సైట్ల జోరు పెరగటమే కాదు.. సెక్సు టాయిస్ అమ్మకాలు భారీగా పెరిగాయి.ఇదిలా ఉంటే.. సెక్సు టాయిస్ కు సంబంధించి మరో కొత్త  మార్పు చోటు చేసుకుంటుంది. ఇప్పటివరకు సెక్సు టాయిస్ ప్లేస్ లో సెక్సు రోబోలు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వస్తున్న ఈ రోబోలు మాట్లాడటమే కాదు.. మూడ్ కు తగ్గట్లుగా వ్యవహరించటం.. కబుర్లు చెప్పటం.. సుదీర్ఘమైన లైంగిక తృప్తిని కలిగించటం వీటి ప్రత్యేకతగా చెబుతున్నారు.

అమెరికాలోని శాన్ డియాగోలోని అబిస్ క్రియేషన్స్ ఫ్యాక్టరీ ఈ సెక్సు రోబోలను తయారు చేస్తుంది. అండ్రాయిడ్ ఆధారంగా పని చేసే ఈ రోబోలు ప్రజలతో మాట్లాడతాయని చెబుతున్నారు. ఈ రోబోట్లు తెలియని వ్యక్తులు.. తెలిసిన మనుషుల మధ్య తేడాను కూడా గుర్తిస్తుందని చెబుతున్నారు. తెలియని వ్యక్తులు తమ ముందుకు వస్తే.. ఈ రోబోట్ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లగలవని చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రత ఆధారంగా మనుషుల మధ్య తేడాల్ని గుర్తిస్తుందని చెబుతున్నారు.

రోబోల్లో మేల్ వర్షన్ మార్కెట్లోకి వచ్చాయి. వీటిని కొనుగోలు చేయటానికి మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. మహిళలకు లైంగిక తృప్తిని అందించే సెక్సు టాయిస్ మరో ప్రత్యేకత.. వారికి సెక్సీ కబుర్లు చెప్పటం. ఈ తరహా సెక్సు టాయిస్ వల్ల సహజ లైంగిక తృప్తిని పొందటానికి మహిళలు ఇష్టపడరని చెబుతున్నారు. ఈ సెక్సు రోబోలతో చిక్కేమంటే.. సెక్సు టాయిస్ తో తృప్తిని చెందటం మొదలు పెడితే.. వాటితోనే కాలం గడుపుతారని.. సహజ లైంగిక తృప్తిని ఇష్టపడరని చెబుతున్నారు. అందుకే.. వాటికి అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కాలం గడిచే కొద్దీ.. కొత్త తరహా సమస్యలంటే.. ఇవేనేమో?