Begin typing your search above and press return to search.

కార్యాల‌యాల‌న్నీ ఖాళీ: హైటెక్ సిటీలో భ‌వ‌నాల‌కంతా టు లెట్ బోర్డులు‌

By:  Tupaki Desk   |   8 July 2020 4:30 PM GMT
కార్యాల‌యాల‌న్నీ ఖాళీ: హైటెక్ సిటీలో భ‌వ‌నాల‌కంతా టు లెట్ బోర్డులు‌
X
ప్ర‌ఖ్యాత సంస్థ‌లు.. ప్ర‌ముఖ కంపెనీలు.. ఐటీకి చిరునామాగా హైద‌రాబాద్‌లోని హైటెక్‌ సిటీ ప్రాంతం నిలిచింది. ఐటీ అంటే హైటెక్ సిటీగా మారింది. అందుకే ఈ ప్రాంతంలో ఒక గ‌జం ల‌క్ష‌ల్లో ఉన్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఈ ప్రాంతంలో ఆఫీస్‌ స్పేస్‌ అంటే హాట్‌ కేక్ గా ఉంటుంది. చిన్నపాటి స్థలం నిర్మాణంలో ఉండగానే బుకింగ్‌ అయిపోయేది. ఈ ప్రాంతాన్ని ఐటీ కారిడార్ అనేవారు. ఈ కారిడార్ పరిధిలోని మాదాపూర్‌, కొండాపూర్‌ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి ఉంది. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కొలువైన ప్రాంతం కాబట్టి దేశంలో ఏ నగరానికి లేనంత డిమాండ్‌ హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ఉండేది.

ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. ఆ ప్రాంతంలో భ‌వ‌న స‌ముదాయాల‌న్నీ టు లెట్ బోర్డులు క‌నిపిస్తున్నాయి. కార్యాల‌యాన్నీ ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇప్ప‌టికే కొత్త కార్యాలయాలకు రిజర్వ్‌ చేసుకున్న కంపెనీలు లీజు ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఉద్యోగులకు ఇళ్ల నుంచే ప‌ని చేయాల‌ని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కార్యాల‌యాల‌కు రావొద్ద‌ని చెబుతున్నాయి. ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రం హోం) చేస్తుండడంతో విశాలమైన కార్యాలయాలు బోసిపోతున్నాయి. అంత స్థ‌లం ఎందుకు అని సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఐటీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌తో పాటు అనేక టెక్‌ కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి.

ప్ర‌స్తుతం ఆయా ప్రాంతాల్లో దాదాపు 1,550 ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీల్లో 6.5 లక్షల మంది పని చేస్తున్నారు. పెద్ద కంపెనీల‌నే ల‌క్ష‌లాది మంది ఉన్నారు. హైటెక్‌ సిటీ ప్రారంభం నుంచి ఐటీకి ఆల‌వాలంగా ఉంది. ఈ ప్రాంతంలో గణనీయ వృద్ధి ఏర్ప‌డింది. ఇప్పటికే ఉన్న కంపెనీలు కార్యాలయాలను విస్తరిస్తుండడం, కొత్త కంపెనీలు కూడా వ‌స్తున్నాయి. ఈ స‌మ‌యంలో ఈ ప్రాంతంలో ఎంతో విలువ పెరిగింది. ఆఫీస్‌ స్పేస్‌కి తీవ్ర కొర‌త ఏర్ప‌డ‌డంతో భారీ డిమాండ్‌ ఉంది. 2019లో దేశవ్యాప్తంగా ఆఫీస్‌ స్పేస్‌ తీసుకున్న ప్రముఖ నగరాల్లో 12.8 మిలియన్‌ చదరపు అడుగులతో హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది వృద్ధి వైర‌స్ వ‌ల‌న తీవ్రంగా ప్ర‌భావం చూపింది.

హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల్లో పెద్ద‌ సంఖ్య‌లో మూడున్నర నెలలుగా ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. గూగుల్‌, డెలాయిట్‌ వంటి ప్రముఖ కంపెనీలు వర్క్ ‌ఫ్రమ్‌ హోం విధానం అమ‌లుచేస్తున్నాయి. దీన్ని డిసెంబర్ వరకు కొనసాగించేందుకు నిర్ణ‌యించాయి. దీంతో కార్యాలయాలు ఉన్నా నిష్ప్ర‌యోజ‌న‌మ‌ని భావిస్తున్నాయి. భ‌వ‌నాలు నిరుపయోగంగా ఉండడంతో లీజుకు తీసుకున్న కార్యాలయాల స్థలాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. కొన్ని చిన్న‌ కంపెనీలు పూర్తిగా ఖాళీ చేసేస్తున్నాయి.