Begin typing your search above and press return to search.

ఒకప్పుడు ఐపియల్ లో స్టార్ క్రికెటర్..ఎప్పుడు పెద్ద దొంగ..ఏమైందంటే!

By:  Tupaki Desk   |   21 Feb 2020 3:30 PM GMT
ఒకప్పుడు ఐపియల్ లో స్టార్ క్రికెటర్..ఎప్పుడు పెద్ద దొంగ..ఏమైందంటే!
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ..ప్రపంచంలోనే అతిపెద్ద t20 లీగ్. అలాగే క్రికెటర్ల పాలిట కనకమహాలక్ష్మి. ఒక్కసారి ఈ లీగ్ లో పార్టిసిపేట్ చేసి ..ఒక్క మ్యాచ్ లో తానేంటో నిరూపించుకుంటే చాలు ..అతడి క్రేజ్ అమాంతం ఆకాశాన్నితాకేస్తుంది. ఈ ఐపియల్ వల్ల ఎంతోమంది మేటి క్రికెటర్లు బయటకి వచ్చారు. మరికొందరు కోట్లని వెనుకేసుకున్నారు. కానీ , తాజాగా ఒక ఐపియల్ మాజీ స్టార్ ఆటగాడు ..తినడానికి ఇష్టం లేక దొంగగా మారాడు. అదేంటి ఐపియల్ లో స్టార్ క్రికెటర్ దొంగతనం చేసాడు అంటే నమ్మడం లేదా అయితే , పూర్తిగా చూడండి ..

ఇంతకీ ..బంగారం లాంటి కెరియర్ ని నాశనం చేసుకున్న ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు.. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్‌ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలుగొందిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ల్యూక్ పోమర్స్‌ బ్యాక్. ఐపీఎల్‌లో అతను ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల‌పాటు ఆడాడు. అయితే చెడు వ్య‌స‌నాలు, తాగుడుకు బానిసైన అతను తన బంగారంలాంటి కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నాడు. తాజాగా ఓ దొంగ‌త‌నం కేసులో అరెస్ట్ అయ్యాడు. త్వ‌ర‌లోనే కోర్టులో అతనిపై కేసు విచార‌ణ‌కు రానుంది. ఒక‌ప్పుడు ఐపీఎల్లో ల‌క్ష‌ల డాల‌ర్ల ధ‌ర ప‌లికిన ల్యూక్‌.. తాజా ప‌త‌నం అత‌ని స్వ‌యం కృతాప‌రాధ‌మ‌న‌డం లో ఎలాంటి సందేహం లేదు.

ఒకప్పుడు తారా జువ్వలాగా దూసుకొచ్చిన ల్యూక్ .. 2007లో ఆస్ట్రేలియా త‌ర‌పున ఏకైక టీ20 ఆడాడు. న్యూజిలాండ్‌ తో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 7 బంతుల్లోనే 15 ప‌రుగులు చేశాడు. ఆ మరుసటి ఏడాది జ‌రిగిన ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 3 ల‌క్ష‌ల డాల‌ర్ల ధ‌ర‌కు ఐపీఎల్ జ‌ట్టు కింగ్స్ లెవ‌న్ పంజాబ్ అత‌నిని కొనుగోలు చేసింది. 2011 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ల్యూక్‌ ను దక్కించుకుంది. ఇక 2013లో మరోసారి పంజాబ్ తరఫున బరిలోకి దిగిన ల్యూక్.. ఆ తరువాత ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్‌లో తన చివరి మ్యాచ్ 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ పై ఆడాడు.

మొత్తంగా 2008 నుంచి 2013 మధ్య వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన అతను మొత్తం 17 మ్యాచ్‌ల్లో 122 ప్లస్ స్ట్రైక్ రేట్‌లో 302 పరుగులు చేశాడు. 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కు ఆడుతున్న సమయం లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్బం గా ఒక అమెరిక‌న్ యువ‌తిని వేధించాడని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ల్యూక్‌ ఆ సీజన్ నుండి మధ్యలోనే వెళ్ళి పోయాడు.

ఊహించని రేంజ్ లో అతి తక్కువకాలంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగిన ల్యూక్ ..ఐపియల్ ప్రస్థానం ముగిసిన తరువాత ఒక సారి బైకు దొంగ‌త‌నం చేసి క‌ట‌క‌టాల‌ పాల‌య్యాడు. ఆ తరువాత ఫుల్లుగా మద్యం సేవించి, డ్రంక్ డ్రైవ్ చేసి పోలీసులకు దొరికిపోయాడు. మ‌రోసారి లిక్క‌ర్ షాప్ నుంచి మ‌ద్యం దొంగిలించి పోలీసులకి చిక్కిపోయాడు. ఈ క్ర‌మంలో క‌నీసం ఉండ‌టానికి ఇల్లు కూడా లేని స్థితిలో ఒక కారులో త‌ల దాచుకున్నాడు. తాజాగా దొంగ‌త‌నం లో మ‌రోసారి ల్యూక్ అరెస్ట‌య్యాడు. అయితే ల్యూక్ అభిమానులు మాత్రం ...ఈ తతంగం అంతా తెలిసి ఆశ్చర్యపోతున్నారు. కాలం అన్ని రోజులు ఒకేలా ఉండదు అని చెప్పడానికి ల్యూక్ జీవితమే ఒక నిర్వచనం అని చెప్పవచ్చు.