సూర్య కుమార్ సూపర్ ఇన్నింగ్స్.. ప్లేఆఫ్స్ కి ముంబై గ్రాండ్ ఎంట్రీ

Thu Oct 29 2020 08:00:45 GMT+0530 (IST)

IPL 2020, RCB vs MI highlights

ఐపీఎల్లో  ఆర్‌సీబీపై విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఈ టోర్నమెంట్ లో  ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.
ముంబై బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడి ముంబై కి గ్రాండ్ విక్టరీ అందించాడు. బెంగళూరు విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19 ఓవర్లలో చేధించింది. ముంబై బ్యాట్స్‌మన్లలో సూర్యకుమార్ యాదవ్ 79 పరుగులు(10 ఫోర్లు 3 సిక్సర్లు)తో బౌండరీలతో చెలరేగగా  ఓపెనర్లు డికాక్ 18 ఇషాన్ కిషన్ 25 పరుగులు చేశారు.ఆర్‌సీబీ బౌలర్లలో సిరాజ్ చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు చేపట్టిన ఆర్‌సీబీకి ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (74; 45 బంతుల్లో 12×4 1×6)జోష్ ఫిలిప్ (33; 24 బంతుల్లో 4×4 1×6) శుభారంభాన్ని అందించారు. 71 పరుగుల భాగస్వామ్యం అందించారు.

పడిక్కల్ చక్కని షాట్లతో  30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయగా కెప్టెన్ కోహ్లి (9)వచ్చిన కాసేపటికే వెనుదిరిగాడు. ఏబీ డివిలియర్స్ (15(కూడా ఎక్కువ సేపు క్రిజ్ లో నిలవలేదు.శివమ్ మావి(4)  వాషింగ్టన్ సుందర్ 10 గురుకీరత్ 14 విఫలం కావడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో ఆకట్టుకోగా బౌల్ట్ పొలార్డ్ రాహుల్ చాహర్ తలా ఒక వికెట్ తీశారు. ఛేదనలో సూర్యకుమార్ (79*; 43 బంతుల్లో 10×4 3×6) విధ్వంసం సృష్టించాడు.డికాక్ (18; 19 బంతుల్లో 1×6) ఇషాన్ కిషన్ (25; 19 బంతుల్లో 3×4 1×6) సౌరభ్ తివారి (5; 8 బంతుల్లో) వరుసగా  వెనుదిరిగారు. చివర్లో కృనాల్ పాండ్య (10; 10 బంతుల్లో 1×4)  హార్దిక్ (17; 15 బంతుల్లో 2×6) అండతో సూర్యకుమార్ ముంబై కి విజయాన్ని అందించాడు.

 బుమ్రా విజృంభణ

ముంబై విజయంలో  బుమ్రా కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లతో  నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి  మూడు వికెట్లు తీశాడు. దూకుడుగా ఆడుతున్న పడిక్కల్  కోహ్లీ శివమ్ దూబే వికెట్లు తీశాడు.

ముంబై.. ఐపీఎల్ చరిత్రలో రెండో స్థానం

ఐపీఎల్ 13వ సీజన్‌లో ఆర్‌సీబీపై విజయం సాధించిన ముంబై ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ముంబై తాను ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు నాలుగు ఓటములతో 16 పాయింట్లు సాధించి దర్జాగా ప్లేఆఫ్ చేరింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నైతర్వాత కనీసం 9సార్లు ప్లే ఆఫ్ చేరిన జట్టుగా ముంబై రెండో స్థానంలో నిలిచింది.