మగాడిగా బతకడం ఇష్టంలేదు.. .జననాంగం మార్చేయండి!

Fri Jun 18 2021 08:00:01 GMT+0530 (IST)

I do not want to live like a man

ఇదొక అరుదైన సంఘటన. 24 సంవత్సరాల క్రితం జరిగింది. హవాయి స్టేట్‌పూనాలో లూనా అనిమిషా జన్మించింది. పుట్టింది అమ్మాయా? అబ్బాయా? అనేది తేల్చలేని పరిస్థితి. ఎందుకంటే.. మగ ఆడ రెండు జననాంగాలతో జన్మించింది. దీంతో.. చిన్న తనంలోనే వైద్యులు సర్జరీ చేసి స్త్రీ జననాంగం తొలగించి మగాడిగా మార్చేశారు. కడుపులో ఉన్న గర్భసంచిని కూడా తొలగించారు. దీంతో.. సమస్య తీరిపోయిందని అనుకున్నారు. కానీ.. ఆ తర్వాతనే మొదలైంది.లూనా వయసు పెరుగుతున్న కొద్దీ.. అతనిలోపల ఆమె లక్షణాలు కూడా పెరుగుతూ వచ్చాయి. గౌన్లు వేసుకోవాలని ఆడవాళ్ల వస్తువులతో ఆడుకోవాలని ఇలా.. అమ్మాయిలు చేసే పనులన్నీ చేయడం మొదలు పెట్టింది. దేహం అబ్బాయిగా ఉండడం.. మానసికంగా అమ్మాయి లక్షణాలు కనిపిస్తుండడంతో తీవ్ర మనో వేదనకు గురైంది. వయసు పెరుగుతున్న కొద్దీ.. తాను అబ్బాయిని కాదని అమ్మాయిని అని పసిగట్టింది.

అప్పటి నుంచి మహిళల దుస్తులే ధరిస్తూ.. అమ్మాయి అని పిలిపించుకోవడం మొదలు పెట్టింది. ''తప్పు నా తల్లిదండ్రులదా? డాక్టర్లదా? అనేది అనవసరం. కానీ.. వారు చేసిన పని వల్ల ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను. నాకు మగాడిగా ఉండడం ఇష్టం లేదు. అమ్మాయిగానే ఉండాలని కోరుకుంటున్నాను.'' అంటోంది అనిమిషా.

ఈ రెండు లక్షణాలతో ఎవరితోనూ కలవలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డానని ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నాని ఆవేదన వ్యక్తం చేసింది అనిమిషా. ఇప్పుడు తాను పెద్దదాన్ని అయ్యానని తన జీవితాన్ని తాను ఎంచుకునే హక్కు కూడా తనకు ఉన్నాయని అంటోంది.

అందుకే.. తాను తిరిగి మహిళగా మారాలని కోరుకుంటోందట. ఆపరేషన్ ద్వారా స్త్రీ జననాంగంతోపాటు గర్భ సంచిని తిరిగి పొందాలని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ ఆపరేషన్ కు అవసరమైన 15 లక్షల డాలర్ల కోసం విరాళాల సేకరణ కూడా మొదలు పెట్టింది. ఈ చికిత్స తర్వాత.. సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న ఇంటర్ సెక్స్ ట్రాన్స్ జెండర్ బాధితుల కోసం పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేస్తానని చెబుతోంది.