హైదరాబాద్ టెక్కీ ప్రాణం తీసిన పని ఒత్తిడి

Fri Mar 31 2023 14:00:01 GMT+0530 (India Standard Time)

Hyderabad Techie Kills Self Due to Work Pressure

సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇప్పుడు అందరూ చేరుకోవాలనుకునే గమ్యం ఇదే.. గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ పెద్ద కంపెనీల్లో చేరాలని.. లక్షల డాలర్లు సంపాదించాలని అందరూ ఈ కొలువు కోసం పరితపిస్తారు. అయితే డబ్బులు ఎంత వచ్చినా సరే ఆ మేరకు పని ఒత్తిడి ఉంటుందన్నది కాదనలేని సత్యం. అలా ఒత్తిడిని జయించిన వారు విజేతలవుతారు. ఒత్తిడికి చిత్తు అయిన వారు ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు.
 
పని ఒత్తిడి ఉద్యోగం పోతుందనే భయంతో హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది..  హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వినోద్ కుమార్ (32) అల్కాపూర్ టౌన్షిప్లోని తన సోదరుడి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన ఈ టెక్కీ కంపెనీ ప్రవేశపెట్టిన కొన్ని కొత్త వర్క్ టూల్స్ కారణంగా ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బంది పడ్డాడు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఆందోళన చెంది ఉద్యోగం పోతుందనే భయాన్ని సోదరుడితో తన ఆవేదన పంచుకున్నారు..

వినోద్ కుమార్ ఇటీవలి వరకు గుంటూరులో ఇంటి నుండి వర్క్ ఫ్రం హోంలో భాగంగా పనిచేశాడు. కానీ ఆఫీస్ నుండి పని ప్రారంభించమని కంపెనీ ఆదేశించడంతో అతను హైదరాబాద్కు వెళ్లి తన సోదరుడి వద్ద ఉంటున్నాడు.

వినోద్ గురువారం  వర్క్ ఫ్రెజర్ తట్టుకోలేక తనతో కాదంటూ విపరీతమైన చర్య తీసుకున్నాడు. అతని సోదరుడు అతని భార్య బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న వినోద్ బెడ్షీట్తో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

వినోద్ కుమార్ సోదరుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వినోద్ కు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇలా సాఫ్ట్ వేర్ రంగంలోని పని ఒత్తిడి ఓ టెకీ ప్రాణాలు తీసేలా చేసింది. కొత్త టెక్నాలజీలు సాఫ్ట్ వేర్ లకు అప్ గ్రేడ్ అవ్వాలని నేర్చుకోవాలన్న ఒత్తిడి.. అందులో రాణించలేకపోతున్నామన్న బాధ ఈ టెకీ ప్రాణాలు తీసింది..         


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.