Begin typing your search above and press return to search.
సినిమా రేంజ్ లో వేటాడారు.. దొంగలపై పోలీసుల కాల్పులు
By: Tupaki Desk | 29 May 2023 6:47 PMదొంగలు బైపాస్ రహదారి గుండా పారిపోతున్నారని పోలీసులకు సమాచారం అందుతుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వైర్లెస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూముకు సమాచారం అందిస్తారు. దీంతో రహదారులపై పోలీసులు ప్రతి వాహనాన్ని ఆపి సోదా చేస్తారు. ఇంతలో ఓ వాహనం పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి మరీ దూసుకుపోతుంది. అలర్ట్ అయిన పోలీసులు ఛేజింగ్ చేస్తూ దుండగులపై కాల్పులు జరుపుతారు.. ఆగండి.. ఈ సినిమా స్టోరీ మాకెందుకు అంటారా.. ఇది సినిమా స్టోరీ కాదు.. నిజామాబాద్ లో జరిగిన రియల్ ఛేజింగ్.
నిజామాబాద్ జిల్లా ఇందర్వాయి మండలం జాతీయ రహదారిపై పోలీసులు దొంగల కోసం కాపు కాశారు. అటుగా వస్తున్నారనే సమాచారంతో వారి పట్టుకునేందుకు అప్రమత్తంగా ఉన్నారు. అయితే పోలీసులు తనిఖీలు చేస్తున్నారనే విషయంలో సమీపంలోకి చేరుకున్నాక దొంగలు కనిపెట్టారు. ఇంకేముంది సినిమా స్టయిల్ ఫాలో అయ్యారు దొంగలు.
గత కొంతకాలంగా ఇందల్వాయిలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. రాజస్థాన్ కు చెందిన ఈ దొంగల ముఠా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటుగా వస్తున్నారనే సమాచారం అందడంలో దొంగలను పట్టుకోవడానికి పక్కా స్కెచ్ వేశారు. పోలీసులు ఉన్నారనే విషయం తెలుసుకున్న దొంగలు రెచ్చిపోయారు. వాహనంలో వచ్చిన వారు పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి మరీ వేగంగా అక్కడి నుండి జారుకున్నారు.
దీంతో పోలీసులు పారిపోతున్న వాహనాన్ని ఛేజింగ్ చేశారు. ఓపిక నశించిన వారు తుపాకీలకు పని చెప్పారు. వారి వద్ద ఉన్న గన్‌లతో దొంగలు వెళుతున్న వాహనంపైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ముందుగా దొంగల వాహనం.. వెనుకాల పోలీసుల జీపు.. ఛేజింగ్.. పోలీసుల కాల్పులు.. మొత్తంగా ఈ సంఘటన అచ్చు సినిమాను తలపించింది. అయినా దొంగలు పరారవడంతో దొంగలను పట్టుకునేందుకు బృందాలుగా విడిపోయిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.