హైదరాబాద్ మెట్రో బండ మామూలుగా లేదు.. కాస్త కలుగజేసుకోండి కేటీఆర్

Fri Mar 31 2023 19:19:56 GMT+0530 (India Standard Time)

Hyderabad Metro announced that the Saver Holiday card charge

నిత్యం ఏదో ఒక ఇష్యూ మీద ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రాలను సంధించే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో జరుగుతున్న అంశాల మీద కూడా ఫోకస్ చేస్తే మంచిది. నిద్ర లేచింది మొదలు కేంద్రం అలా చేయాలి?



ఇలా చేయాలని అడగటం వరకు బాగానే ఉన్నా.. తాము కూడా కొన్నింటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది విషయాన్ని ఆయన ఎప్పుడు గుర్తిస్తారు? ఇప్పటికే బతుకుబండి భారంగా మారుతున్న వేళ.. కిందా మీదా పడుతున్న సామాన్యుడికి మరింత షాకిచ్చేలా నిర్ణయాలు జరుగుతున్నాయి.

తాజాగా హైదరాబాద్ మెట్రో మంట పుట్టే మాట చెప్పింది. ఇప్పటివరకు అమలు చేస్తున్న రాయితీలను ఏప్రిల్ ఒకటి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అంతేకాదు.. రద్దీ వేళల్లో డిస్కౌంట్ ఎత్తేయనున్నట్లు పేర్కొంది. అంతేకాదు సేవర్ హాలీడే కార్డు ఛార్జ్ ను భారీగా పెంచనున్నట్లుగా ప్రకటించారు. మెట్రో కార్డు.. క్యూఆర్ కోడ్ పై ఇప్పటికే పది శాతం రాయితీ ఉంది.

అయితే.. దీన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎత్తేయనున్నారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాయితీలు ఉండవని.. రాత్రి 8 గంటలనుంచి 12 గంటల వరకు డిస్కౌంట్ ఇస్తామని చెబుతున్నారు.

అంతేకాదు.. ఆదివారాలు.. ఇతర జాతీయ సెలవు దినాలు.. పబ్లిక్ హాలీడేస్ సందర్భంగా రోజు మొత్తంలో ఎన్నిసార్లు మెట్రోలో ప్రయాణించినా.. కేవలం రూ.59తో రీఛార్జ్ చేయించుకుంటే ప్రయాణించే వీలుంది.

ఇప్పుడా సౌకర్యాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం ఉన్న రూ.59 స్థానే రూ.99గా కార్డు ధరను పెంచనున్నారు. మిగిలిన సార్మ్ కార్డ్స్ ధరల్ని పెంచనున్నట్లుగా చెబుతున్నారు. ఇలా ప్రతిది భారంగా మారిపోతున్న వేళ.. మెట్రో విధించిన రాయితీల కోతలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ రియాక్టు అయితే బాగుండన్న మాట వినిపిస్తోంది. మరి.. మంత్రి కేటీఆర్ కు ఈ విన్నపాలు వినిపిస్తాయా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.