Begin typing your search above and press return to search.

రైడర్స్ -నైట్ రైడర్స్ మ్యాచ్.. ఫీల్డ్ అంపైర్ ఎవరూ ? ఆడా? మగా? ఫ్యాన్స్ కన్ఫ్యూషన్

By:  Tupaki Desk   |   19 Oct 2020 5:00 AM GMT
రైడర్స్ -నైట్ రైడర్స్ మ్యాచ్.. ఫీల్డ్ అంపైర్ ఎవరూ ? ఆడా? మగా? ఫ్యాన్స్ కన్ఫ్యూషన్
X
అబుదాబిలో నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ పరిస్థితుల్లో టైగా ముగిసింది. సూపర్ ఓవర్ థ్రిల్లర్ ని తలపించింది. ఐతే ఈ మ్యాచ్ లో మరో ఆసక్తికర విషయం అందరినీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ పొడవాటి జుట్టుతో కనిపించారు. అలా లూస్ హెయిర్ తో కళ్లద్దాలు పెట్టుకుని అంపైరింగ్ చేశారు. దీంతో క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ఇంతకీ ఫీల్డ్ అంపైర్ ఎవరు? ఆడా? మగా? అని ఆరా తీయడం మొదలు పెట్టారు. దీంతో ఆ ఫీల్డ్ అంపైర్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బహుశా ఐసీసీ అనుమతులు ఇవ్వడంతో ఐపీఎల్‌లో తొలిసారిగా ఓ మహిళ అంపైరింగ్ చేస్తోందా? అని చాలా మంది చర్చించుకున్నారు. పొడవాటి నల్లని జట్టు.. దానిని కవర్ చేస్తూ క్యాప్ కూడా ధరించి ఉండడంతో.. అసలు ఆ అంపైర్ ఆడా? మగా? నో అర్థం కాక కన్‌ఫ్యూజ్ అయ్యారు. చాలా మంది ట్విట్టర్ లో ఫీల్డ్ అంపైర్ ఫోటోలు షేర్ చేసి ఈ పర్సన్ ఎవరో చెప్పాలని కోరారు.

కొందరు క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఆ అంపైర్‌ ను గుర్తుపట్టారు.మహిళ అంపైర్ కాదని పురుషుడేనని క్లారిటీ ఇచ్చారు. ఆయన పేరు పశ్చిమ్ పాఠక్ అని.. వెల్లడించారు. ఆయన లుక్ వెరైటీ గా ఉందని నెటిజన్లు మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. పశ్చిమ్ పాఠక్ చాలా కాలంగా అంపైరింగ్ చేస్తున్నారు. 2009 నుంచి దేశవాలీ వన్డే మ్యాచ్‌ లు, టెస్ట్‌ మ్యాచ్‌లకు అంపైర్‌ గా సేవలందిస్తున్నారు. పాఠక్ కు ఐపీఎల్ కొత్త కాదు. 2014లో కూడా 8 ఐపీఎల్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. అంపైర్లల్లో పాఠక్ చాలా వెరైటీ 2015లో ఆయన తలకు హెల్మట్‌ కు ధరించే అంపైరింగ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. హెల్మెట్ ధరించి అంపైరింగ్ చేసిన తొలి భారత అంపైర్ పశ్చిమ పాఠకే. ఈ వెరైటీ అంపైర్ తన హెయిర్ స్టయిల్ తో మరోసారి వార్తల్లో నిలిచారు.