హైదరాబాద్ లో మహమ్మారి డేంజర్ బెల్స్

Sun May 24 2020 20:00:01 GMT+0530 (IST)

Hyderabad In Dangerous Place over in this Situation

హైదరాబాద్ ను మహమ్మారి వణికిస్తోంది. తాజాగా లాక్ డౌన్ సడలింపులతో జనాలు రోడ్లమీదకు రావడం.. ఆఫీసులన్నీ తెరుచుకోవడంతో వైరస్ విజృంభిస్తోంది. ప్రజాజీవనం మొదలైన హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లోని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్టు చూస్తే హైదరాబాద్ లో పరిస్థితి అదుపు తప్పుతున్నట్టు అర్థమవుతోంది. గడిచిన 12 రోజుల్లోనే హైదరాబాద్ పరిధిలో 500 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు కొత్తగా కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.

తాజాగా నమోదవుతున్న కేసులు సికింద్రాబాద్ లో ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం అక్కడ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. సికింద్రాబాద్ లో ఇప్పటిదాకా ఉన్న 9 కంటైన్మెంట్ జోన్లకు అదనంగా కొత్త జోన్ల ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో హైదరాబాద్ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. సామాజిక దూరం పాటించడం.. మాస్క్ శానిటైజర్ల వాడకం సహా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.