Begin typing your search above and press return to search.

హనీట్రాప్ : శృంగార కక్కుర్తి కోసం వెళ్లి ఇలా బుక్కయ్యాడు

By:  Tupaki Desk   |   22 March 2023 10:00 PM
హనీట్రాప్ : శృంగార కక్కుర్తి కోసం వెళ్లి ఇలా బుక్కయ్యాడు
X
ఒక అందమైన మహిళ.. తాను రగిలిపోతున్నా.. తన కోరిక తీర్చు అని అంటే ఏ మగాడు కూడా ఆగలేడు. పరుగున వెళతాడు.. హైదరాబాద్ కు చెందిన యువ పారిశ్రామికవేత్త కూడా అదే చేశాడు. సరిగ్గా పని మొదలుపెట్టి ఎంజాయ్ చేశాడు. కానీ పూర్తికాకముందే అసలైన ట్విస్ట్ వచ్చిపడింది. ఆ హఠాత్ పరిణామానికి బిత్తరపోయిన పారిశ్రామికవేత్త పోలీసులను ఆశ్రయించి లబోదిబోమన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువ పారిశ్రామికవేత్త (28) హనీట్రాప్ కు గురయ్యాడు. ఒక అందమైన మహిళ శృంగార వాంఛతో రగిలిపోతున్నా రమ్మంటే వెళ్లాడు. అయితే తనను బుక్ చేయడానికి ఇదంతా ఆమె చేస్తోందన్న విషయాన్ని అతడు గ్రహించలేదు.

టెలిగ్రామ్ యాప్ ద్వారా మెహర్ అనే యువతి ఈ యువ పారిశ్రామికవేత్తకు పరిచయమైంది. ఇద్దరూ చాటింగ్ మొదలై సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆ మహిళ తన భర్త దుబాయ్ లో ఉంటున్నాడని.. తాను లైంగిక తృప్తి కోసం సరైన భాగస్వామి కోసం చూస్తున్నానని అతడికి చెప్పింది. తన వద్దకు వచ్చి నీ కోరిక తీర్చుకోవాలని తన చిరునామా లోకేషన్ ను పంపించింది.

ఒక మహిళ శృంగారం కోసం పిలవడంతో సొల్లు కార్చుకున్న ఆ పారిశ్రామికవేత్త వెళ్లి ఆమెను కలిశాడు. ఇద్దరు ఆమె ఇంట్లో ఉన్న సమయంలోనే ముగ్గురు వ్యక్తులు ఎంట్రీ ఇచ్చారు. నువ్వు సున్తీ చేయించుకోవాలని.. ఆమెను వివాహం చేసుకోవాలని బెదిరించారు. తమ మాట వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు.

ఈ బెదిరింపులకు భయపడిపోయిన బాధితుడు వెంటనే తేరుకొని వాళ్ల నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇలా హనీ ట్రాప్ పేరిట మహిళలు చాలా మందిని బుట్టలో పడేస్తున్నారు. శృంగార వాంఛకని వెళుతూ అడ్డంగా బుక్కైపోతున్నారు. కొందరు నగ్న వీడియో కాల్స్ తో దొరికిపోతుండగా.. మరికొందరు ఇలా బయట బుక్కైపోతున్నారు. ఈ ఉదంతాలు తరచూ జరుగుతున్నా జనాల్లో మార్పు మాత్రం రావడం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.