అశ్లీల దృశ్యాల్లో కనిపించిన భార్య.. భర్త ఆత్మహత్యాయత్నం

Mon Jan 17 2022 20:14:24 GMT+0530 (IST)

Husband commits suicide after watching wife pornography

తూర్పు గోదావరి జిల్లాలో ఒక కుటుంబాన్ని అశ్లీల దృశ్యాలు కృంగుబాటుకు గురిచేశాయి. భార్య అశ్లీల దృశ్యాలు చూసిన భర్త తట్టుకోలేక పిల్లలకు పురుగుల మందు తాగించి తనూ తాగాడు. పండుగ పూట ఈ ఘటన స్థానికులను షాక్ కు గురిచేసింది.తూర్పు గోదావరి జిల్లాలోని వంగలపూడికి చెందిన ఓ మహిళ ఉద్యోగ నిమిత్తం కువైట్ కు వెళ్లింది. భర్త ఆటోడ్రైవర్ గా పనిచేస్తుంటాడు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. భర్త తన స్వగ్రామం గోకవరంలో ఉంటాడు. పిల్లలు అమ్మమ్వ వద్ద ఉంటారు.

కరోనా కారణంగా కువైట్ లోనే సదురు మహిళ ఉండిపోయింది. రాలేకపోయింది. అయితే తాజాగా భర్త మొబైల్ కు ఓ వాట్సాప్ వీడియో వచ్చింది. అది ఓపెన్ చేసి చూస్తే మరో వ్యక్తితో తన భార్య సన్నిహితంగా.. అసభ్యకరంగా ఉన్న దృశ్యాలు అందులో కనిపించాయి. దీంతో భర్త షాక్ అయ్యాడు.

పండగ కోసం వంగలపూడి వచ్చిన భర్త తన ముగ్గురు పిల్లలతో కలిసి మామాడితోటలోకి వెళ్లి అవమాన భారంతో పురుగుల మందు తాగాడు. పిల్లలకూ తాగించే ప్రయత్నం చేశాడు. చేదుగా ఉందంటూ ఇద్దరు పిల్లలు తాగడానికి నిరాకరించాడు. 10 ఏళ్ల చిన్నోడు మాత్రం తాగేశాడు. తండ్రి చిన్న కొడుకు అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. స్థానికులు వీరిని గమనించి పోలీసులకు సమాచారం అందించి తండ్రీ కొడుకును ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. తన సమీప బంధువు నుంచి ఈ వీడియో తనకు వచ్చిందని.. అందుకే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించానని ఆటోడ్రైవర్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వీడియోపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.