Begin typing your search above and press return to search.

భార్యకు బోలెడన్ని ఆఫైర్లు అని..చేయకూడని పని చేసేశాడు

By:  Tupaki Desk   |   17 Feb 2020 1:30 AM GMT
భార్యకు బోలెడన్ని ఆఫైర్లు అని..చేయకూడని పని చేసేశాడు
X
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. వైవాహిక జీవితంలో ఎక్కువ భాగం నమ్మకంతోనే నడుస్తుంది. ఆ స్థానంలో అనుమానం ప్రవేశిస్తే కాపురం కాస్తా కిందామీదా పడిపోవటం ఖాయం. తన భార్యకు నలుగురికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఒక భర్త చేయకూడని పని చేశాడు. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ చోటు చేసుకుందంటే..

కెన్యాకు చెందిన డెన్నిస్ ముమో అనే వ్యక్తి వ్యాపారం చేస్తుంటాడు. అతడికి అనుమానం రోగం ఎక్కువ. వ్యాపార పనుల్లో భాగంగా తరచూ ఊళ్లకు వెళుతుంటాడు. తన భార్య తనతో కాకుండా మరో నలుగురితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానం ఆయన భావించేవాడు. దీంతో..తాను ఊరికి వెళ్లేటప్పుడు భార్య జననాంగం దగ్గర జిగురు పదార్థం రాసి సీల్ చేసేవాడు.

అతడు అనుకుంటున్నట్లుగా తాను ఎలాంటి తప్పు చేయలేదని వేడుకున్నా.. అతగాడు తన తీరును మార్చుకునేవాడు కాదు. ఇటీవల వ్యాపార నిమిత్తం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఎప్పటిలానే తన భార్య యోని దగ్గర మళ్లీ జిగురు పదార్థం పెట్టేసి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిన తర్వాత ఆమెకు భరించలేనంత మంట పుట్టటంతో ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్ ఆమె పరిస్థితికి షాక్ తిన్నాడు. వెంటనే.. పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత ఆమెకు ట్రీట్ మెంట్ ఇచ్చారు.

భర్త తీరుకు షాక్ తిన్న పోలీసులు అతడి మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశాడు. అయితే.. తన భార్యకు నలుగురు యువకులతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించాడు. దీనికి ఆధారాలు చూపించాలంటే చూపించలేకపోయాడు. దీంతో.. అతడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అనుమానం పెనుభూతమని ఊరికే అనలేదేమో?