కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి చంపేశాడు

Mon Aug 15 2022 10:22:37 GMT+0530 (India Standard Time)

Husband Murderd Wife In Court

దారుణ ఉదంతం చోటు చేసుకుంది. దీనికి వేదికగా కర్ణాటకలోని ఒక కోర్టు ఆవరణ కావటం గమనార్హం. ప్రేమించి పెళ్లి చేసుకొని.. కొన్నేళ్లు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకునే క్రమంలో చోటు చేసుకున్న ఆరాచకం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కోర్టు ఆవరణలో భార్య గొంతు కోసిన వైనం భయాందోళనలకు గురయ్యేలా చేసింది. అసలేం జరిగిందంటే..



కర్ణాకటలోని హాసన జిల్లాలోని తట్టికెరెకు చెందిన 34 ఏళ్ల చైత్ర అనే యువతిని 27ఏళ్ల శివకుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు ఆరేళ్లు కాపురం చేశారు. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. అయితే.

ఈ మధ్యన భార్యభర్తల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో.. భర్త నుంచి విడిపోయిన చైత్ర తనకు విడాకులుకావాలని కోరింది. దీంతో.. వీరిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

రెండేళ్ల క్రితం వీరు దాఖలు చేసుకున్న విడాకుల పిటిషన్ ను తాజాగా లోక్ అదాలత్ లో రాజీ కోసం వీరిద్దరూ హాజరయ్యారు. అయితే.. ఈ కేసును మరో తేదీకి వాయిదా వేశారు. వాయిదా వేసిన అనంతరం చైత్ర తన రెండేళ్ల బాబును తీసుకొని వెళుతోంది.

ఇదే సమయంలో అనూహ్యంగా వ్యవహరించిన శివకుమార్ తన చేతిలో ఉన్న కత్తితో భార్య గొంతు కోసి పరారయ్యాడు. కోర్టు ఆవరణలోని టాయిలెట్స్ వద్ద ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

తీవ్రంగా గాయపడిన చైత్రకు ప్రధమ చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతున్న చైత్ర తాజాగా కన్నుమూసింది. దీంతో కేసు నమోదు చేుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.