కొడుకు నీకు పుట్టినోడు కాదన్న భార్య.. చంపేసిన భర్త

Fri Mar 17 2023 10:00:56 GMT+0530 (India Standard Time)

Husband Killed Wife and Child in Hyderbad

హైదరాబాద్ శివారులో చోటు చేసుకున్న జంట హత్యల ఉదంతానికి సంబంధించిన అసలు కారణం తాజాగా బయటకు వచ్చేసింది. భార్య లావణ్యను.. నెలన్నర క్రియాన్ష్ ను తానే దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసుల ముందు లొంగిపోయిన భర్త ధనరాజ్ పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. ఎందుకు హత్య చేశావన్న విషయాన్ని చెప్పేసిన అతడు.. తన భార్య కోపంలో కొడుకు నీకు పుట్టినోడు కాదన్న మాటకు ఆవేశానికి గురై చంపేసినట్లుగా పేర్కొన్నారు.ధనరాజ్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అనంతరం కోర్టు ఎదుట హాజరుపర్చగా.. పద్నాలుగు రోజుల రిమాండ్ కు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. ఇంతకూ వారి మధ్య గొడవ ఎక్కడ జరిగింది? ఎందుకు అంతలా చంపాల్సి వచ్చిందన్న విషయాన్ని ధనరాజ్ పోలీసులకు వివరించారు.

పోలీసు వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. బుధవారం మధ్యహ్నాం 12 గంటల వేళలో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అత్తగారింటి నుంచి భార్య లావణ్య నెలన్నర కొడుకు క్రియాన్ష్ ను వెంట పెట్టుకొని ధనరాజ్ అనాజ్ పూర్ లోని ఇంటికి బయలుదేరాడు.

కుటుంబ విషయాల్లో భార్యతో మొదలైన వాదన చివరకు గొడవగా మారింది. ఈ క్రమంలో భార్య లావణ్య తనను తిడుతూ.. పుట్టిన కొడుకు నీకు పుట్టినోడు కాదని ఆగ్రహంగా దూషించిందన్నారు. దీంతో.. తీవ్ర కోపానికి గురైన ధనరాజ్.. ఆమె ముఖం మీద బీరు సీసాతో దాడి చేశాడు. కింద పడిపోయిన ఆమెను అక్కడే ఉన్న గొడ్డలి తీసుకొని నరికేసినట్లుగా ఒప్పుకున్నాడు. అనంతరం నెలన్నర పసిగుడ్డు క్రియాన్ష్ ను అక్కడే ఉన్న నీటి సంపులో పడేసి తాను పారిపోయినట్లుగా పోలీసులకు వెల్లడించాడు.

టూవీలర్ మీద పారిపోయిన అతను కొద్ది గంటల తర్వాత పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయాడు. అదనపు కట్నం కోసం తన బిడ్డను ధనరాజ్ వేధించి.. హత్య చేసినట్లుగా భార్య లావణ్య తండ్రి నర్సింగరావు ఇచ్చిన కంప్లైంట్ ను పోలీసులు నమోదు చేశారు.  తన భార్య మీద తనకు ఎలాంటి అనుమానం లేదని.. ఆమె ఆగ్రహంతో కొడుకు నీకు పుట్టినోడు కాదని అన్నందుకే ఆగ్రహంతో తాను చంపేసినట్లుగా పేర్కొన్నాడు.

ధనరాజ్ పోలీసుల ఎదుటకు వచ్చి లొంగిపోలేదని.. అతను హయత్ నగర్ లో ఉన్నాడన్న సమాచారాన్ని అందుకొని పోలీసులే అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. కోపంతో భార్య తీవ్రమైన మాట అన్నదని.. ఆమెను దారుణంగా చంపేయాలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.    నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.