Begin typing your search above and press return to search.

ఎలన్ మస్క్ ఎఫెక్ట్, భారీగా పెరిగిన క్రిప్టోకరెన్సీ విలువ..ఏంచేశాడంటే?

By:  Tupaki Desk   |   14 Sep 2021 6:20 AM GMT
ఎలన్ మస్క్ ఎఫెక్ట్, భారీగా పెరిగిన క్రిప్టోకరెన్సీ విలువ..ఏంచేశాడంటే?
X
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంటే మామూలు విషయం కాదు. క్రిప్టో కరెన్సీ విషయంలో ఎలాన్ మస్క్ అంటే ఏంటో తెలిసింది. అందుకే ఎలాన్ మస్క్‌ కు క్రిప్టోకరెన్సీ మదుపుదారులు చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు. క్రిప్టోకరెన్సీ పై ఎలన్‌ మస్క్‌ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. డాగ్‌ కాయిన్‌ క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లు ఎలన్‌ మస్క్‌ను ముద్దుగా డాగీ ఫాదర్‌ అని పిలుచుకుంటారు. ఎందుకంటే డాగ్‌ కాయిన్‌ క్రిప్టోకరెన్సీ విలువ పెరగడంలో మస్క్‌ పాత్ర ఎంతగానో ఉంది.

టెస్లా, స్పేస్‌ ఎక్స్ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన ప్రభావాన్ని చూపించారు. క్రిప్టోకరెన్సీ పై ఎలాన్ మస్క్ ప్రభావం ఇంకా ఆగలేదు. అది కొనసాగుతూనే ఉంది. ఎలాన్ మస్క్ పాత్ర క్రిప్టోకరెన్సీ పై చాలానే ఉంటుంది. బహుశా అందుకే క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లు ఎలాన్ మస్క్‌ ను ముద్దుగా డాగీ ఫాదర్ అని పిల్చుకుంటారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేస్తూ ఫ్లోకీ వచ్చేసిందంటూ ట్వీట్ చేశారు.

అంతే, ఆ ఒక్క ఫోటో షేర్ ఎఫెక్ట్ క్రిప్టోకరెన్సీ విలువ అమాంతంగా పెరిగిపోయింది. కేవలం డాగ్ కాయిన్ మాత్రమే కాకుండా బేబీ డాగ్ వంటి ఆల్ట్ నాణేలు కూడా గణనీయంగా పెరిగాయి. ఎలాన్ మస్క్ తన పెంపుడు జంతువు ఫోటో షేరింగ్‌ కు,క్రిప్టోకరెన్సీ విలువ పెరగడానికి సంబంధమేంటని ఆలోచిస్తున్నారా. కచ్చితంగా ఉంది. క్రిప్టోకరెన్సీ సింబల్‌ ను షిబాఇను బ్రీడ్ కుక్కతోనే చూపిస్తారు. అందుకే ఎలాన్ మస్క్ ఆ ఫోటో షేర్ చేయగానే విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది.

డాగ్ కాయిన్ క్రిప్టోకరెన్సీనే కాకుండా మరికొన్ని ఇతర క్రిప్టోకరెన్సీలను కూడా ఇదే బ్రీడ్‌ తో చూపిస్తారు. షిబా ఫ్లోకీ థీమ్‌తో ఉన్న క్రిప్టోకరెన్సీ విలువ దాదాపు 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 958.09 శాతం మేర పెరిగిపోయింది. అటు ఇంకో క్రిప్టోకరెన్సీ ఫ్లోకిఇను కూడా 24 గంటల వ్యవధిలో 59.08 శాతం పెరిగింది. అటు ఫ్లోకి శిబా క్రిప్టోకరెన్సీ 23.46 శాతం పెరిగింది. బేబీ డాగ్ కాయిన్ విలువ 1.80 శాతం జంప్ అయింది. డాగ్ కాయిన్ గడిచిన 24 గంటల్లో 0.36 శాతం మేర మార్పును నమోదు చేసింది.