మీరు నిరుద్యోగులా .. అయితే ఛలో సింగపూర్..!

Mon Mar 01 2021 07:00:01 GMT+0530 (IST)

Huge job opportunities in Singapore

త్వరలో సింగపూర్‌లో భారీగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయట. ఆ దేశంలో 12 లక్షల మంది డిజిటల్ స్కిల్డ్ వర్కర్లు అవసరం అంట..  ఓ సర్వే ఈ విషయాన్ని తేల్చింది. అమేజాన్ వెబ్ సిరీస్ ఆస్ట్రేలియా ఇండియా ఇండోనేషియా జపాన్ సింగపూర్ దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో సర్వే నిర్వహించింది. రానున్న రోజుల్లో ఆయా దేశాలు డిజిటల్ నైపుణ్యపరంగా ఎదుర్కోనున్న సవాళ్ళపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే సంస్థ మొత్తం ఆరు దేశాల్లోని 3వేల మంది నుంచి వివరాలు సేకరించింది. అయితే ప్రస్తుతం సింగపూర్‌లోని ప్రతి పదిమంది ఉద్యోగుల్లో ఆరుగురు తమ విధుల్లో డిజిటల్ నైపుణ్యాలను వినియోగిస్తున్నారు. అయితే సింగపూర్‌కు భవిష్యత్తులో 12 లక్షలమంది డిజిటల్ నైపుణ్యాలను కావాల్సిన వారు అవసరం అని సదరు సర్వే సంస్థ తేల్చింది. నిరుద్యోగులు 2025 నాటికి ఉద్యోగం అవసరమయ్యేవారు ప్రస్తుతం విద్యార్థులుగా ఉండి ఉద్యోగాల్లో చేరేవారికి డిజిటల్ నైపుణ్యాలు అవసరమని ఈ సర్వే సంస్థ తేల్చింది. 2025 నాటికి సింగపూర్‌లోని ఉద్యోగులకు 2.38 కోట్ల డిజిటల్ స్కిల్ ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించాల్సి వస్తుందని సర్వే పేర్కొన్నది.

 భారత్ లో అయిదేళ్లలో 39 కోట్ల ట్రైనింగ్ సెషన్స్ అవసరమని వెల్లడించింది.2020-2025 మధ్య భారత్‌తో పాటు జపాన్ సింగపూర్ దేశాల్లోని డిజిటల్ స్కిల్డ్ సిబ్బందికి అడ్వాన్స్డ్ క్లౌడ్ స్కిల్స్‌కు డిమాండ్ ఎక్కువ అని ఈ సర్వే సంస్థ తేల్చింది. దీనిని బట్టి సింగపూర్‌లో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉండబోతున్నాయన్నమాట.