Begin typing your search above and press return to search.
బొల్లినేని శ్రీనివాస గాంధీకి గట్టి షాక్
By: Tupaki Desk | 24 Feb 2021 1:00 PM ISTఈడీ మాజీ అధికారి, ప్రస్తుత జీఎస్టీ సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీకి గట్టి షాక్ తగిలింది. ఆయనపై ఇప్పటికే 5 కోట్ల రూపాయల లంచం కేసులో సీబీఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆయనతోపాటు చిలక సుధారాణి అనే మరో అధికారి కూడా సస్పెండ్ అయ్యారు.
ఇదివరకు బొల్లినేని ఈడీలో ఉన్న సమయంలో ఏపీ సీఎం జగన్, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి వంటి హైప్రొఫైల్ కేసులను విచారించారు. జీఎస్టీ సూపరింటెండెంట్ గా నియమితులయ్యాక అయిదు కోట్ల రూపాయలు లంచం కేసులో ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఆయన ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. ఆదాయానికి మించి ఆస్తులను ఆర్జించిన విషయంలో సీబీఐ విచారణను బొల్లినేని ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సీబీఐసీ చర్యలు తీసుకుంది. బొల్లినేని శ్రీనివాసగాంధీంతో పాటు సుధారాణిని సస్పెండ్ చేసింది. తన సామాజికవరగ్ానికి చెందిన సుజనా చౌదరి కేసును బొల్లినేని నీరుగార్చారని.. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో సీబీఐ నిఘా పెట్టి కేసులు పెట్టింది.
హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ లో పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతి బయటపడింది. ఇన్ ఫుట్ క్రెడిట్ మంజూరుకు అధికారులు ఓ కంపెనీ డైరెక్టర్ల నుంచి ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో ఉద్యోగులు సుధారాణి, బొల్లినేని శ్రీనివాస గాంధీ, ఓ ప్రైవేటు కంపెనీ డైరెక్టర్ సత్య శ్రీధర్ రెడ్డిలపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా బొల్లినేని శ్రీనివాసగాంధీకి పేరుంది.బొల్లినేని 2004 నుంచి 2017 వరకు బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఈడీలోనే విధులు నిర్వర్తించారు.అప్పట్లో ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఆయనపై నమోదైంది.