Begin typing your search above and press return to search.

జై జవాన్ : అగ్నిపధ్ కి భారీ రెస్పాన్స్...

By:  Tupaki Desk   |   14 Aug 2022 9:30 AM GMT
జై జవాన్ : అగ్నిపధ్ కి భారీ రెస్పాన్స్...
X
మోడీ సర్కార్ రక్షణ దళంలో తీసుకొచ్చిన కీలకమైన సంస్కరణ అగ్నిపధ్ పధకం. దీని మీద దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన వ్యక్తం అయింది. అదే విధంగా దేశాన్ని బలి పెడతారా అని విపక్షాలు గట్టిగా బాణాలు వేశాయి. సైనికుల పోస్టులను టెంపరరీ విధానంలో తీయడమేంటి అని కూడా ప్రశ్నలు వచ్చాయి. ఎవరేమి చేసిన ఎన్ని రకాలుగా చెప్పినా మోడీ సర్కార్ అగ్నిపధ్ విషయంలో ముందుకే అని సాగిపోతోంది.

ఇదిలా ఉండగా అగ్నిపధ్ పధకం కింద తొలిసారిగా ఏపీలో భారీ రిక్రూట్మెంట్ మొదలైంది. ఉత్తరకోస్తా జిల్లాలతో పాటు యానం ప్రాంతాలలో ఉన్న ఔత్సాహిక యువకుల నుంచి అగ్నిపధ్ పధకం కింద ఎంపిక చేసేందుకు విశాఖ వేదికగా 14 నుంచి రిక్రూట్మెంట్ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా విశాఖ విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లలతో పాటు క్రిష్ణా, యానం జిల్లాల నుంచి దాదాపుగా అరవై వేల మంది అభ్యర్ధులు అగ్నిపధ్ నియామకాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు.

వారంతా విశాఖకు ఒక రోజు ముందే చేరుకున్నారు. ఎంతటి కఠినమైన పరీక్షలు అయినా తట్టుకుని అగ్నివీరులుగా తమను తాము రుజువు చేసుకునేందుకు యువత పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం. ఏకంగా అరవై వేల మంది అభ్యర్ధులు అంటే అగ్నిపధ్ పధకానికి భారీ ఎత్తున స్పందన లభించినట్లుగా చెబుతున్నారు.

కాగా ఈ రిక్రూట్మెంట్ కోసం విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. విశాఖలో వాతావరణం మారింది. వాన పడుతోంది. అయినా సరే అగ్నివీరులు మాత్రం ఎక్కడా తగ్గేది లేదంటూ రావడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ అక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే విశాఖ సాగరతీరంలో కూడా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

కేవలం నాలుగేళ్ళ కాల పరిమితి కోసం అంగిపధ్ ద్వారా ఎంపికలు చేస్తున్నారు. అయితే ఈ నాలుగేళ్లలో తమ సత్తాను చాటుతూ మంచి పనితీరు కనబరిస్తే వారిని పూర్తి స్థాయిలో సైన్యంలో కొనసాగించే విధంగా కూడా ఎంపిక చేస్తారు. ఇక ఏపీ నుంచి అగ్నిపధ్ రిక్రూట్మెంట్ కి తరలి వస్తున్న యువకులు తాము పూర్తి కాలం సైన్యంలో పనిచేస్తామని, తమ సత్తాను చాటుతామని అంటున్నారు. ఈ నెల 31 వరకూ విశాఖ లో అగ్నిపధ్ రిక్రూట్మెంట్స్ ఉంటాయని అధికారులు తెలిపారు.