Begin typing your search above and press return to search.

ఇన్ స్టా పోస్టులతో కోహ్లీ ఎంత సంపాదిస్తున్నాడంటే?

By:  Tupaki Desk   |   30 Sep 2022 7:00 AM GMT
ఇన్ స్టా పోస్టులతో కోహ్లీ ఎంత సంపాదిస్తున్నాడంటే?
X
ఆటలోనే కాదు.. ఆర్జనలో కూడా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తా చాటుతున్నాడు. టీమిండియా కెప్టెన్ గా దిగిపోయినా కానీ అతడి క్రేజ్ తగ్గడం లేదంటే అతిశయోక్తి కాదు.. అతడి ఏడాది సంపాదన వంద కోట్ల వరకూ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కెప్టెన్సీ కోల్పోయినా విరాట్ సంపాదన ఏమీ తగ్గలేదు. సోషల్ మీడియా ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా అత్యధికంగా ఆర్జించిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు.

మైదానంలో ఫాం కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ ఇటీవల ఆసియా కప్ సందర్భంగా సెంచరీ కొట్టి మళ్లీ పాత కోహ్లీని గుర్తుకు తెచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్ లోనూ అదరగొట్టాడు. సోషల్ మీడియాలో కోహ్లీ యాక్టివ్ గా ఉంటాడు. ఇన్ స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీకి ఏకంగా21.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ స్థాయిలో ఫాలోవర్లు ఎవరికీ లేరు. దీంతో కోహ్లీకి రికార్డు స్తాయిలో డబ్బులు వస్తున్నాయి.

కరోనా లాక్ డౌన్ సమయంలో విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే ఇన్ స్టా గ్రామ్ ద్వారా సంపాదనలో ఏకంగా 6వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ లాక్ డౌన్ కాలంలో స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా ఏకంగా రూ.3 కోట్ల 63 లక్షలు సంపాదించారు. అంటే ఒక్క పోస్టు విలువ రూ.1కోటీ 21 లక్షలు అన్నమాట..

ఈ ఇన్ స్టాగ్రామ్ సంపాదనలో పోర్చుగల్ ఫుట్ బాలర్ క్రిస్టియానో రోనాల్డో రూ.17కోట్ల 24లక్షలతో టాప్ లో కొనసాగుతున్నాడు. అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ (రూ.11.50 కోట్లు), నెయ్ మర్ (రూ.10.53 కోట్లు) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు.ఇక ఫుట్ బాల్ లో తొలి బిలియనీర్ గా క్రిస్టియానో రొనాల్డో అవతరించాడు. టీమ్ స్పోర్ట్స్ లో ఈ ఘనత సాధించిన తొలి ఫుట్ బాలర్ గా రికార్డులెక్కాడు. గత ఏడాదిలో రొనాల్డో సంపాదన రూ.793 కోట్లు. బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన మూడో ఆటగాడు ఇతడు...

ఇన్ స్టాగ్రామ్ లో పలు బ్రాండ్లకు సంబంధించి కోహ్లీ ఒక్క పోస్టు చేస్తే రూ.8.90 కోట్లు ఆర్జిస్తున్నట్టు ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో 20 పోస్టులు చేసి శ్రీలంక దరిద్రాన్ని తరిమేయగలడని సెటైర్లు వేస్తున్నారు. దేశంలోని పేదరికాన్ని కూడా కోహ్లీ నిర్మూలించగలడని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇక విరాట్ కోహ్లీ తర్వాత భారత్ లో అత్యధిక బ్రాండ్ వాల్యూతోపాటు ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్ ఎంఎస్ ధోనినే. కోహ్లీ తర్వాత సంపాదనలోనూ ధోని ముందంజలో ఉన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.