Begin typing your search above and press return to search.

లవ్వర్ ను అత్యంత దారుణంగా చంపేసిన అఫ్తాబ్ జైల్లో ఎలా ఉన్నాడు?

By:  Tupaki Desk   |   5 Dec 2022 4:18 AM GMT
లవ్వర్ ను అత్యంత దారుణంగా చంపేసిన అఫ్తాబ్ జైల్లో ఎలా ఉన్నాడు?
X
ప్రేమించాడు..కలిసి జీవిద్దామన్నాడు.. నమ్మి వచ్చిన అమ్మాయిని అత్యంత దారుణంగా. కసాయి కంటే నీచంగా శరీర భాగాల్ని నరికేసి.. రోజుల తారబడి ఇంట్లోని ఫ్రిజ్ లో పెట్టేసి.. ఒక్కో భాగాన్ని ఒక్కో రోజు బయటకు తీసుకెళ్లి గుట్టు చప్పుడు కాకుండా పడేసిరావటం.. అదే సమయంలో పలువురు అమ్మాయిలతో డేట్ చేస్తూ.. ఇంటికి ఆహ్వానించటం లాంటి షాకింగ్ ఉదంతాల గురించి తెలిసిందే. ప్రియురాలిని అంత దారుణంగా హతమార్చిన ఈ కిరాతకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. తీహార్ జైలుకు తరలించటం తెలిసిందే.

ఈ కేసు ఉదంతం గురించిన వివరాలు బయటకు వచ్చిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంతటి ఘోరానికి తలపెట్టిన అప్తాబ్ కు సంబంధించిన వివరాల్ని సేకరించే పనిలో పడ్డారు. ఈ మధ్యనే అతగాడికి జైల్లోనే పాలిగ్రాఫ్.. నార్కో టెస్టుల్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారుల్ని ఒక పుస్తకం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. జైల్లో ఖైదీలతో పెద్దగా మాట్లాడరని చెబుతున్నారు. తన మానాన తాను ఉండటం.. ఎవరితోనూ మాట కదపటం లాంటివి అస్సలు పట్టించుకోరంటున్నారు.

అఫ్తాబ్ కోరిన మీదట అతనికి 'ది గ్రేట్ రైల్వే బజార్' అనే పుస్తకాన్ని చదువుకోవటానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ పుస్తకంలో ఎక్కడా కూడా నేరాలు.. వాటికి సంబంధమూ లేదని.. అందుకే అధికారులు ఆలోచించి ఈ బుక్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా భావిస్తున్నారు. ఈ పుస్తకాన్నిఅప్తాబ్ చదువుతున్నట్లుగా తెలుస్తోంది. ఆసియా దేశాల్లో తన రైలు ప్రయాణాలు ఎలా సాగాయి? అన్న దానిపై పుస్తకం ఉంటుందని చెబుతున్నారు.

ఇక జైల్లో అతనికి చెస్ ఇవ్వగా.. తనకు తానే ఆడుకుంటున్నాడని.. ఎవరిని తన ఆటలోకి రానివ్వలేదని చెబుతున్నారు. నల్ల పావులు.. తెల్ల పావులతో తానే ఆడుకుంటున్న వైనాన్ని జైలుఅధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. జైలు గదిలో అతడితో పాటు.. మరో ఇద్దరు నేరస్తులు ఉన్నారు. వారిద్దరిపైనా చోరీ కేసులు ఉన్నాయని చెబుతున్నారు.

తన సహచర ఖైదీలతో ఎలా ఉంటాడన్న విషయాలపై అధికారులు పోకస్ చేస్తున్నారు. అయితే ఒంటరిగా కూర్చోవటానికి.. తన పుస్తకం తాను చదువుకోవటం.. లేదంటే తనకు తానుగా ఒంటరిగా కాలం గడపటంలాంటివి చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

అతడిలోని నేర ప్రవర్తనను నిశితంగా గమనిస్తున్నట్లు చెబుతున్నారు. జైల్లో అతడి తీరు గమనిస్తున్న అధికారులు మాత్రం ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయానికి రావటం తొందరపాటే అవుతుందంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.