Begin typing your search above and press return to search.

ఉత్తరకొరియా కిమ్ కు అప్పుడే భయం ఎలా పోయింది?

By:  Tupaki Desk   |   25 May 2022 8:30 AM GMT
ఉత్తరకొరియా కిమ్ కు అప్పుడే భయం ఎలా పోయింది?
X
ఉత్తరకొరియాను ఇప్పుడు కరోనా భయపెడుతోంది. కల్లోలంగా మార్చేసింది. కరోనాతో అక్కడ లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు. మొదట్లో కరోనాకు భయపడి మాస్క్ పెట్టుకున్న దేశాధినేత కిమ్ ప్రస్తుతం అవేమీ లేకుండానే యథేచ్ఛగా తిరుగుతున్నాడు. ముఖానికి మాస్క్ కూడా లేకుండా ఓ సైనిక జనరల్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఉత్తరకొరియాకు చెందిన పీపుల్స్ ఆర్మీ మార్షల్ హయోన్ చాల్ హెయ్.. శరీర అవయవాలు పనిచేయక మృతి చెందారు. ఆయన కిమ్ కు అత్యంత నమ్మకస్తుడు.

ఈ క్రమంలో కిమ్ స్వయంగా తన గురువైన హయోన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శవపేటికను స్వయంగా మోయడం విశేషం. ఆ సమయంలో మిగిలిన అధికారులంతా మాస్కులు ధరించినా.. కిమ్ మాత్రం మాస్క్ లేకుండానే అంత్యక్రియల్లో పాల్గొనడం విశేషం.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు కొరియన్ పీపుల్స్ ఆర్మీ మార్షల్ హ్యోన్ చోల్ హయే గురువు. అనారోగ్య కారణాలతో ఆయన మృతిచెందారు. దీంతో ఆయన అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొన్న కిమ్ నివాళులర్పించారు.

ఇటీవల మాస్క్ ధరించిన కనపడిన కిమ్.. గురువు అంత్యక్రియల్లో మాత్రం మాస్క్ లేకుండానే పాల్గొన్నారు. ఇతరులు అందరూ మాస్కులు ధరించి ఇందులో పాల్గొన్నారు. గురువు శవపేటికను కూడా కిమ్ మోశారు.

కిమ్ జాంగ్2 మరణం అనంతరం కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో కొరియన్ పీపుల్స్ ఆర్మీ మార్షల్ హ్యోన్ చోల్ హయే కీలక పాత్ర పోషించారు. అందుకే గురువుపై కిమ్ అంత భక్తిని చాటుకున్నారు.