Begin typing your search above and press return to search.

సింగిల్ షాట్ తో దేశ ప్రజల్ని ఫిదా చేసేసిన మోడీ

By:  Tupaki Desk   |   3 Aug 2021 2:30 PM GMT
సింగిల్ షాట్ తో దేశ ప్రజల్ని ఫిదా చేసేసిన మోడీ
X
అనూహ్యమైన నిర్ణయాల్ని తీసుకోవటంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముందుంటారు. తన మీద వచ్చే పొంగి పొర్లే వ్యతిరేకతను మరిచిపోయేలా ఆయన తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. రెండో దఫా ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఆయనకు ఎదురవుతున్న సవాళ్లు అన్ని ఇన్ని కావు. అన్నింటికంటే ఎక్కువగా కరోనాఆయనకు ఎంత ఇమేజ్ తీసుకొచ్చిందో.. అంతే డ్యామేజీని సెకండ్ వేవ్ తీసుకొచ్చింది. అయినప్పటికీ వెనక్కి తగ్గక.. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఆయన వ్యవహరించే తీరు చూస్తే ముచ్చట వేయాల్సిందే.

సాధారణంగా ఎంత పెద్ద అధినేత అయినా.. తన మీద వ్యతిరేకత షురూ అయిందన్న వాదనతోనే ఒత్తిడికి గురవుతుంటారు. మోడీ మాత్రం అందుకు భిన్నంగా.. తన మీద ఉండే వ్యతిరేకతను పాలపొంగులా మార్చటంలో ఆయన వేసే ఎత్తులు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి నిర్ణయాల్ని తీసుకున్న ఆయన పలువురిని విస్మయానికి గురి చేస్తున్నారు. ఈ నెల రెండో వారంలో పంద్రాగస్టు కార్యక్రమం రానుంది. దీన్ని తనకో అవకాశంగా మార్చుకున్నారు మోడీ.

ఇప్పటివరకు మరే ప్రధాని చేయని రీతిలో ఆయన ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. పంద్రాగస్టు రోజున దేశ రాజధాని ఎర్రకోట వద్ద జరిగే జెండా వందనం కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా ఎవరిని ఆహ్వానించారో తెలుసా? ఒలింపిక్స్ లో భారత్ తరఫున ఆడిన ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ రావాలని ఆయన కోరారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఆ రోజున తాను క్రీడాకారుల్ని కలవటంతోపాటు వారిని తనతో పాటు తన నివాసానికి కూడా ఆహ్వానిస్తున్నారు.

ఇప్పటికే వెయిట్ లిఫ్టిం్ విభాగంలో మీరాభాయి చాను రజత పతకం సాధిస్తే.. తెలుగమ్మాయ్ సింధు కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తామిద్దరం కలిసి ఐస్ క్రీం తిందామని సింధుకు మోడీ స్వయంగా చెప్పటం తెలిసిందే. జులై 23న మొదలైన విశ్వక్రీడలు.. ఈ నెల 8తోముగియనున్నాయి. అంటే.. మరో ఐదురోజుల్లో ముగియనున్నాయి.

టోక్యో నుంచి వచ్చిన వారంలోనే భారత ప్రధాని క్రీడాకారుల్ని స్వయంగా కలిసి.. వారిలోస్ఫూర్తి నింపనున్నారు. ఈ కార్యక్రమం భావి క్రీడాకారులకు కొత్త స్ఫూర్తిని ఇవ్వటమే కాదు.. దేశ ప్రజల్ని ఫిదా అయ్యేలా చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే వర్చువల్ పద్దతిలో క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పిన మోడీ.. ఈవెంట్ ముగిసిన తర్వాత అందరిని పిలిపించి.. వారిని ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించటం ద్వారా క్రీడాకారులకుదేశంలో పెరుగుతున్న ప్రాధాన్యతను చెప్పకనే చెప్పేస్తున్నారని చెప్పాలి.

ఇలాంటి తీరు.. గతంలో మరే ప్రధానమంత్రి చేపట్టకపోవటం మోడీకి కలిసి వచ్చేలా ఉందని చెప్పాలి. ప్రస్తుతం రాజకీయం మొత్తం పెగాసస్ చుట్టూ తిరుగుతున్న వేళ.. దాన్ని పక్కన పెట్టేసేలా.. మోడీ తాజా ప్రకటన ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సింగిల్ నిర్ణయంతో దేశ ప్రజల్ని ఫిదా చేసే టాలెంట్ మోడీ మాష్టారికి సొంతమని చెప్పక తప్పదు.