Begin typing your search above and press return to search.

రూ.90 కోట్ల అప్పుకు ఆశ చూపి.. రూ.20లక్షలు కొట్టేశారు

By:  Tupaki Desk   |   14 Jan 2021 3:46 AM GMT
రూ.90 కోట్ల అప్పుకు ఆశ చూపి.. రూ.20లక్షలు కొట్టేశారు
X
ఆశ తప్పు కాదు. అత్యాశతోనే ఇబ్బంది అంతా. అలాంటివారి కోసమే కొందరు కేటుగాళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఒక్కసారి వారి చేతికి చిక్కితే చాలు.. నిండా ముంచేస్తారు. అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా వెలుగు చూసింది. వ్యాపారంలో వచ్చిన నష్టాల్ని భర్తీ చేసుకోవటం అడ్డదారుల్ని తొక్కిన సదరు వ్యాపారికి దిమ్మ తిరిగే షాకు తగిలింది.

హైదరాబాద్ మహానగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక పేపర్ కంపెనీ యజమాని అయిన నాగేశ్వరరావు ఎర్రమంజిల్ లో ఉంటారు. ఆయనకు చెందిన పేపర్ కంపెనీనష్టాల్లో కూరుకుపోవటంతో.. అప్పు కోసం వెతుకుతున్నారు. ఇలాంటివేళ..వారికి మాదాపూర్ కు చెందిన సవేర ఏజెన్సీ నిర్వాహకులు దొరికారు.

మాటల మాయాజాలంతో రూ.90 కోట్లు అప్పు ఇప్పిస్తానని సదరు సవేరా ఏజెన్సీకి చెందిన నాగరాజు.. లీలాకాంత్.. చింతేశ్వరరావులు చెప్పారు. ఇందుకు డిపాజిట్ గా రూ.20లక్షలు ముందుగా చెల్లించాలని కోరారు. దీంతో వారి మాటల్ని నమ్మిన నాగేశ్వరరావు రూ.20 లక్షలు ఇచచారు. దీనికి ప్రతిగా వారు గూగుల్ ఇండియా సర్వీస్ నుంచి నకిలీ మంజూరు పత్రాన్ని తయారు చేసి ఇచ్చారు. ఇందులో రూ.90 కోట్ల లోన్ మొత్తాన్ని ప్రాసెస్ చేసినట్లుగా దొంగ పత్రాల్ని ఇచ్చారు. తొలుత దీన్ని నమ్మిన నాగేశ్వరరావు తనకు రుణంగా వచ్చే రూ.90 కోట్ల ఆశతో ఎదురుచూస్తున్నారు.

అయితే.. వారు చెప్పిన సమయానికి రాకపోవటం.. అంతకంతకూ ఆలస్యం కావటంతో సందేహం వచ్చిన అతడు చెక్ చేసుకోగా.. తాను మోసపోయిన విషయాన్ని గుర్తించారు నాగేశ్వరరావు. దీంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయినా.. అంత పెద్ద వ్యాపారాలు చేసిన పెద్ద మనిషిని ఎంత సింఫుల్ గా మోసపోయాడో కదా? అత్యాశ పెద్దమ్మ అలాంటిది మరి. ఒకసారి తల మీదకు ఎక్కితే.. భారీగా నష్టపోయే వరకు విడిచిపెట్టదు మరి.