Begin typing your search above and press return to search.

త్వరలో వారానికి 3 రోజులు సెలవులు... కొత్త లేబర్ చట్టంలో ఏముంది ?

By:  Tupaki Desk   |   19 Jun 2021 10:30 AM GMT
త్వరలో వారానికి 3 రోజులు సెలవులు...  కొత్త లేబర్ చట్టంలో ఏముంది ?
X
వారానికి 3 రోజులు సెలవులు, 4 రోజులు మాత్రమే పని దినాలు అనే ఆప్షన్ వినడానికి ఉద్యోగులకు ఆనందంగా ఉంటుంది. యాజమాన్యాలకు మాత్రం నచ్చదు. వారానికి 2 రోజులు సెలవులు ఇవ్వడమే ఎక్కువ... ఇక 3 రోజులు కావాలా అని ఫైర్ అవుతాయి. ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్ కోసం పనిచేస్తోంది త్వరలో సెలవుల నిబంధనలలో మార్పు రావచ్చని అంటున్నారు. దేశంలో చేసిన కొత్త కార్మిక చట్టాల ప్రకారం రాబోయే రోజుల్లో వారంలో మూడు రోజులు సెలవు ఉంటుందని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో కొత్త నిబంధనల ప్రకారం వారంలో ఎన్ని గంటలు పని చేయాలో తెలుసుకోండి. వారంలో ఐదు రోజులకు బదులుగా 4 రోజులు ఉద్యోగం ఉంటుందని, రెండు రోజులకు బదులుగా వారంలో 3 రోజులు సెలవు ఉంటుందని చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం కంపెనీ ఉద్యోగులు పరస్పర అంగీకారం ద్వారా ఈ ఒప్పందం చేసుకోవచ్చు.

ఏదేమైనా 4 రోజులు పనిచేసిన తర్వాత మీ రోజువారీ షిఫ్ట్ సమయాలలో మార్పు ఉండవచ్చు. దీని కారణంగా పని గంటలను12 కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎంపికను కొత్త లేబర్ కోడ్‌లోని నిబంధనలలో కూడా ఉంచనున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీనిపై కంపెనీ ఉద్యోగులు పరస్పరం అంగీకరించిన నిర్ణయం తీసుకోవచ్చు. దీనితో పాటు వారంలో 48 గంటల పని గరిష్ట పరిమితిని ఉంచినట్లు కూడా చెప్పబడింది. అటువంటి పరిస్థితిలో పని దినాలను తగ్గించవచ్చు. మీరు ప్రస్తుతం వారానికి 5 రోజులు 9 గంటలు పని చేస్తే మీరు ప్రతి వారం 45 గంటలు పని చేస్తారు కానీ మీరు 12 గంటల షిఫ్ట్ ప్రకారం 4 రోజులు పని చేస్తే మీరు 48 రోజులు పని చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు అదనపు పనిని 30 నిముషాలు లెక్కించడం ద్వారా 15 నుంచి 30 నిమిషాల మధ్య ఓవర్ టైం లో లెక్కించే నిబంధన ఉందని ఈ నివేదికలో చెప్పబడింది. తద్వారా కంపెనీ మీకు ఎక్కువ పని చేస్తే మీకు అదనపు డబ్బు కూడా లభిస్తుంది.

జపాన్‌ లో ప్రస్తుతం వారానికి 2 రోజుల సెలవులు అమల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో వారానికి 3 రోజులు సెలవులు ఇస్తే, ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తుండటాన్ని గమనించాయి కంపెనీలు. దాంతో జపాన్‌లోనూ అమలుచేసి చూశారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. జపాన్ ప్రజలు ఎక్కువ ఆదాయం కోసం అదనపు పనిగంటలు పనిచేస్తున్నారు. అలా పనిచేస్తూనే ఆఫీసుల్లోనే నిద్రపోతున్నారు. అక్కడే గడిపేస్తున్నారు. డబుల్ షిఫ్టులు చేస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యం పాడవ్వడమే కాదు, మానసిక సమస్యలూ పెరుగుతున్నాయి. ఫ్యామిలీతో గడపలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వం 3 రోజుల సెలవు దినాల రూల్ తేవాలనుకుంటోంది.