Begin typing your search above and press return to search.

దేశంలో అధిక జీతాలు చెల్లించే నగరం ఇదే

By:  Tupaki Desk   |   29 May 2023 6:00 AM GMT
దేశంలో అధిక జీతాలు చెల్లించే నగరం ఇదే
X
ఖర్చు బారెడు.. సంపాదన మూరెడు అన్నట్టుగా పరిస్థితి ఉంది. పెరుగుతున్న ఖర్చులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వేతన జీవుల ఆశలన్నీ జీతాలపైనే ఉన్నాయి. అసలు దేశంలో ఏ నగరాల్లో ఉద్యోగులకు ఎక్కువగా వేతనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

టీమ్ లీజ్ సర్వీసెస్ నివేదిక ప్రకారం.. 2023లో దేశంలోనే అత్యధికంగా వేతనాలు అందిస్తున్న నగరాల్లో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. దేశంలోని వివిధ పరిశ్రమలలోని జీతాల ట్రెండ్ ల ఆధారంగా 2022-23లో అత్యధికంగా చెల్లించే నగరాల జాబితాలో బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ ఉన్నాయి. జీతాల పెంపు విషయంలో గత ఏడాదితో పోల్చితే బెంగళూరు నగరం 7.79 శాతం వేతన వృద్ధి రేటుతో అందరినీ ఆకట్టుకుంటోంది.

బెంగళూరులోని టెలికాం రంగం అత్యధిక జీతం ఇస్తోంది. రిలేషన్ షిప్ మేనేజర్ పాత్ర 10.19శాతం జీతం పెంపు తర్వాత మార్కెట్లో అత్యధికంగా చెల్లించే ఉద్యోగంగా మారింది. అలాగే మధ్యస్థ జీతాల పెంపు 8.03 శాతం వద్ద ఉంది.

హెల్త్ కేర్ , అనుబంధ పరిశ్రమలు తయారీ రంగంలో వేతన వృద్ధి అత్యధికంగా 20.46 శాతం ఉంది. అయితే క్రమంలో విద్యారంగంలో 51.83 శాతం సగటు జీతం వృద్ధిని సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

ఇదే సమయంలో హాస్పిటాలిటీ, ఆటోమొబైల్ & అనుబంధ పరిశ్రమలు, ఈ-కామర్స్ , టెక్ స్టార్ట్ అప్ లు, మీడియా, ఎంటర్ టైన్ మెంట్ వంటి పరిశ్రమలు సగటు జీతాలు తగ్గాయి.

గ్లోబల్ లేఆఫ్స్ , స్టార్టప్ ఫండింగ్ వింటర్ కొనసాగుతున్నప్పటికీ భారతీయ ఉద్యోగ మార్కెట్ అభివృద్ధి చెందుతూనే ఉందని టీమ్ లీజ్ సర్వీసెస్ సీఈవో స్టాఫింగ్ కార్తిక్ నారాయణ్ తెలిపారు.