Begin typing your search above and press return to search.

అంబటి రాయుడు రిటైర్మెంట్... వాట్ నెక్స్ట్....?

By:  Tupaki Desk   |   30 May 2023 8:43 PM GMT
అంబటి రాయుడు రిటైర్మెంట్... వాట్ నెక్స్ట్....?
X
టీమిండియా క్రికెటర్ ఏపీకి చెందిన అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఆయన బ్యాటింగ్ అదుర్స్. మైదానంలో ఉంటే చాలు మెరుపులు మెరిపిస్తారు. అలాంటి అంబటి రాయుడు క్రికెట్ లో తన ఇన్నింగ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అన్ని ఫార్మేట్ల నుంచ్ తప్పుకుంటున్నట్లుగా అంబటి స్టేట్మెంట్ ఇచ్చేశారు.

ఆయన బీసీసీఐ తరఫున ఆడారు. హెచ్ సీఏ, ఏసీఏ తరఫున ఆడారు. ఐపీఎల్ లో కూడా ఆడారు ముంబై చెన్నై జట్లలో కీలకంగా ఉన్నారు. అలాంటి అంబటి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన తరువాత స్టెప్ ఏంటి అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే అంబటి రాయుడు గత కొంతకాలంగా రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు.

ఆయన ఏపీ సీఎం జగన్ని తెగ పొగుడుతున్నారు. తన ట్విట్టర్ ద్వారా జగన్ సభలను హైలెట్ చేస్తూ గ్రేట్ సీఎం అంటూ కీరిస్తున్నారు. ఇటీవలే ఆయన సీఎం ని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలుసుకుని చాలా విషయాలు ముచ్చటించారు. అపుడే ఆయన వైసీపీలో చేరుతారు అని ప్రచారం సాగింది.

తనకు ఉన్న కొన్ని కమిట్మెంట్స్ కారణంగా ఆయన ఇంతకాలం రాజకీయంగా కీలక ప్రకటన చేయలేదు అని అంటున్నారు. ఇపుడు అలాంటి అడ్డ్లు ఏవీ లేదు. దాంతో అంబటి రాయుడు ఇపుడు ఫ్రీ బర్డ్ అనే అంటున్నారు తొందరలోనే రాజకీయాల మీద అంబటి కీలక నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

అంబటి రాయుడుది గుంటూరు జిల్లా అని తెలుస్తోంది. ఆయన బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. దాంతో వచ్చే ఎన్నికల్లో శాసన సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని చూస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. అది గుంటూరు నా లేక క్రిష్ణానా లేక ఏపీలో ఎక్కడైనా నా అన్నది తెలియదు కానీ అంబటి రాయుడు భారతీయ క్రికెటర్.

ఆయనకు ఎంతో ఇమేజ్ ఉంది. దాంతో పాటు యూత్ ఫాలోయింగ్ ఉంది. అదే టైం లో ఆయన బలమైన సామాజికవర్గం ఇవ్వన్నీ కూడా అధికార పార్టీకి ఉపయోగపడతాయన్ అంటున్నారు. ఇదిలా ఉంటే అంబటి క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చేసి రాజకీయాల వైపు వస్తారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఇపుడు ఆయన మొదటి పని పూర్తి చేశారు ఇక మిగిలింది ఆయన రాజకీయ రంగ ప్రవేశమే అని అంటున్నారు.

మరి జగన్ తో తొలి భేటీ సందర్భంగా అంబటి రాయుడు ఏమి మాట్లాడారు, ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి వైసీపీ ఓకేనా. అదే జరిగితే వైసీపీ జెండా ఆయన ఎపుడు కప్పుకుంటారు ఇలాంటివి అన్నీ ప్రశ్నలే. జవాబు మాత్రం తొందరలోనే దొరుకుతుంది అని ఆశించవచ్చు అంటున్నారు. ఇక క్రీడామైదానంలో మెరుపు షాట్స్ తీసిన అంబటి రాజకీయ మైదానంలో మెరుపులు మెరిపిస్తారా అసలు ఆయన పాలిటిక్స్ ఇంటెరెస్ట్ ఏంటి అన్నది కూడా చూడాల్సి ఉంది.