Begin typing your search above and press return to search.

ఓ మహిళతో న్యాయాధికారి శృంగార వీడియో వ్యాప్తికి హైకోర్టు అడ్డుకట్ట

By:  Tupaki Desk   |   3 Dec 2022 12:30 AM GMT
ఓ మహిళతో న్యాయాధికారి శృంగార వీడియో వ్యాప్తికి హైకోర్టు అడ్డుకట్ట
X
నవంబర్ 29న లీక్ అయ్యి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న  ఓ న్యాయ అధికారితో మహిళ శృంగార వీడియోను వైరల్ కాకుండా ఆపాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వ్యాప్తి నిరోధించాలని ఆదేశించింది.

జస్టిస్ యశ్వంత్ వర్మ, బాధిత పక్షం  గుర్తింపును "దాచిపెట్టడానికి" ఒక అభ్యర్థనను అనుమతించింది. చట్టాలను ఉల్లంఘించడంతో పాటు, వీడియో సర్క్యులేషన్ వల్ల పిటిషనర్ గోప్యతా హక్కులకు కోలుకోలేని హాని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేశారు.

 రిజిస్ట్రార్ జనరల్ అన్ని సందేశాలపై వీడియోను నిరోధించడానికి తగిన చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని అధికారులకు తెలియజేసినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో పాటు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఈ వీడియోను నిరోదించాలని కోరారు.

"ఆ వీడియోలోని కంటెంట్‌  లైంగికంగా అసభ్యకరంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పిటిషనర్ యొక్క గోప్యతా హక్కులకు సంభవించే కోలుకోలేని హానిని పరిగణనలోకి తీసుకోవాలని.. ప్రకటన మధ్యంతర ఎక్స్-పార్ట్ ఇంజక్షన్  ఉత్తర్వుల్లో పేర్కొంది.వీడియో తదుపరి సర్క్యులేషన్, షేరింగ్ , డిస్ట్రిబ్యూషన్ అనుమతించబడినట్లయితే, ప్రాథమికంగా చట్టాలను ఉల్లంఘించినట్లు కనిపిస్తుంది "అని హైకోర్టు పేర్కొంది.

2022 మార్చి 9న ఆ వీడియోలో ఉన్న ఓ వ్యక్తి దాఖలు చేసిన దావాను అత్యవసర పరిశీలనకు స్వీకరించి కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సామాజిక మాధ్యమాలకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.