Begin typing your search above and press return to search.

ఏకంగా ప్రైవేట్ పార్ట్ లో బంగారం దాచేసి...

By:  Tupaki Desk   |   6 Jun 2023 8:00 PM GMT
ఏకంగా ప్రైవేట్ పార్ట్ లో బంగారం దాచేసి...
X
బంగారం అక్రమ రవాణా రూటు మారుతోందనే చెప్పాలి. ఒకప్పుడు వస్తువుల్లో, బ్యాగుల్లో దాచి రవాణా చేస్తుండే వారు. ఆ తర్వాత లో దుస్తుల్లో, బెల్టుల్లో, విగ్గుల్లో, డ్రెస్సుల్లో రక రకాలు గా పెట్టు కొని అక్రమం గా సరఫరా చేసేవారు. ఇప్పుడు అక్రమార్కులు సరికొత్త పంథా ను అవలంభిస్తున్నారు.

ఏకంగా శరీరం లోపల.. పురిష నాళం నుంచి బంగారాన్ని జొప్పించి రవాణా చేస్తున్నారు. అలా అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, శంషాబాద్ విమానాశ్రయ నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు.

అసలు ఏం జరిగిందంటే... హైదరాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీ గా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ డిపార్ట్‌ మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుమానస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా... వారి నుంచి కోటి విలువైన 1705.3 గ్రాముల బంగారం బయటపడింది. ఇక ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల కు ఇండిగో ఫ్లైట్ నెంబర్ 6 E- 1484‌ లో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకు లు వచ్చారి. వారి వ్యవహారశైలి అనుమానంగా ఉండటంతో కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు వారిని అడ్డగించారు. వారిని తనిఖీ చేశారు. పురిషనాళం లో బ్లాక్ టేప్‌ తో చుట్టి బంగారం పేస్ట్‌ తో కూడిన ఆరు క్యాప్సూల్స్‌ దాచి నట్లు తేలింది.

అనంతరం ఇద్దరు ప్రయాణీకుల నుంచి 1.05 కోట్ల రూపాయల విలువైన 17.5.3 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ తెలిపింది. భారతీయ కస్టమ్స్ చట్టం 1962 కింద ప్రయాణీకులు ఇద్దరినీ అరెస్ట్ చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటన చూసి కస్టమ్స్ అధికారులు కంగుతిన్నారు. బంగారాన్ని ఇలా కూడా స్మగ్లింగ్ చేస్తున్నారా అంటూ ఆశ్చర్య పోయారు. ఇక బంగారం స్మగ్లింగ్ రోజు రోజు కు ఎక్కు వై పోతుంది. చాలా మంది డబ్బుకు ఆశ పడి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. వారి తగ్గట్లు అధికారులు కూడా కట్టుదిట్ట మైన చర్యలు తీసుకుంటున్నారు.