Begin typing your search above and press return to search.

సీఎం అయిన హీరో విజయ్​ తండ్రి .. కాకపోతే చిన్న ట్విస్ట్​!

By:  Tupaki Desk   |   20 Nov 2020 5:00 AM GMT
సీఎం అయిన హీరో విజయ్​ తండ్రి .. కాకపోతే చిన్న ట్విస్ట్​!
X
ఇళయదళపతి విజయ్​ తండ్రి, సీనియర్​ దర్శకుడు ఎస్​ఏ చంద్రశేఖర్ సీఎం అయ్యారు. అదేంటి రాజకీయాల్లోకి రాకముందే ఆయన సీఎం ఎలా అయ్యారని ఆశ్చర్యపోతున్నారా? అయన నిజజీవితంలో సీఎం కాలేదు.. ఓ సినిమాలో ఆయన సీఎంగా నటిస్తున్నారు.అయితే ఇటీవల ఆయన మక్కల్​ ఇయక్కమ్​ అనే రాజకీయ పార్టీని ఎన్నికల సంఘంలో రిజిస్టర్​ చేశారు. ఈ విషయం తమిళనాట పెద్ద సంచలనంగా మారింది. విజయ్​ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ అంతా భావించారు.

కానీ విజయ్​ మాత్రం భిన్నంగా స్పందించారు. తన తండ్రి పెట్టబోయే రాజకీయాపార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. తన అభిమాన సంఘాలు తండ్రి పెట్టిన రాజకీయపార్టీ కోసం పనిచేయొద్దని కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య తీవ్ర మనస్ఫర్థలు నెలకొన్నట్టు వార్తలు వచ్చాయి. విజయ్​ను ఎలాగైనా రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆయన తండ్రి చంద్రశేఖర్​ భావిస్తుండగా.. విజయ్​ మాత్రం పొలిటికల్ ఎంట్రీకి ఇది కరెక్ట్​ టైం కాదని భావిస్తున్నారట.

మరోవైపు వెంకట్​ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో ఎస్​ఏ చంద్రశేఖర్​ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. ‘ మానాడు’ పేరుతో తెరకెక్కుతున్న ఈచిత్రంలో శింబు హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్​ పుదుచ్చేరిలో జరుగుతున్నది. ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్​, భారతిరాజా, ఎస్జే సూర్య, మనోజ్​ తదితరులు నటిస్తున్నారు. సురేశ్​ కామాక్షి నిర్మాత.