చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు భారీ ప్రమాదం

Wed Dec 08 2021 15:04:32 GMT+0530 (India Standard Time)

Helicopter carrying BP Rawat crashed in Tamil Nadu

భారత త్రివిధ దళాల తొలి అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ -సీడీఎఫ్) బిపిని రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ తమిళనాడులో కుప్పకూలింది. కోయంబత్తూరు కూనూరు వద్ద ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ లో ఆ సమయంలో 14 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో రావత్ కుటుంబ సభ్యులు ఆయన సహాయ సిబ్బంది తదితరులున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. బుధవారం విల్లింగ్టన్ కేంద్రం నుంచి ఈ ఆర్మీ హెలికాప్టర్ బయల్దేరింది. ఆ కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కుప్పకూలింది. కాగా దుర్ఘటన తీవ్రత చాలా ఎక్కువ గానే ఉన్నట్లు సమాచారం. బిపిన్ రావత్ భార్య దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని భారత వాయుసేన ధ్రువీకరించింది. ముగ్గురిని రక్షించినట్టు తెలుస్తోంది.

అయితే బిపిన్ రావత్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రావత్ ప్రయాణిస్తున్నది ఎంఐ17 వీఎఫ్ హెలికాప్టర్. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వాయు సేన పేర్కొంది. గాయపడిన నాలుగో వ్యక్తి కోసం గాలింపు జరుగుతోందని తెలుస్తోంది. గాయపడినవారిని నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు.

కాగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటైన సీడీఎఫ్ కు తొలి అధిపతి బిపన్ రావత్ . త్రివిధ దళాల సమన్వయం కోసం అత్యున్నత స్థాయి పదవిగా దీనిని ఏర్పాటు చేశారు. సైనిక హోదా రీత్యా చూస్తే రావత్ దేశంలో అత్యున్నతం. అలాంటి వ్యక్తి ప్రమాదానికి గురికావడం భారీ సంచలనమే.