గుండెనొప్పా.. లైట్ తీసుకోకండి.. రిస్క్ లో పడతారు

Mon Sep 28 2020 05:00:01 GMT+0530 (IST)

Heartattack .. Do not take light

కొంతమంది గుండె నొప్పి వస్తే చాలా లైట్‌గా తీసుకుంటూ ఉంటారు. చాతి తేదా గుండె నొప్పి వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌గా భావించి తేలికగా తీసుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. గుండెలో మంటగా అనిపించినా.. శ్వాస తీసుకోవడంలో  ఇబ్బంది ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని.. ఈసీజీ లాంటి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. గుండెపోటు (హార్ట్ ఎటాక్) వచ్చినప్పుడు మొదటి గంట చాలా కీలకమని హెచ్చరిస్తున్నారు. హాస్పిటల్‌కు వెళ్లకుండా ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు.హార్ట్ ఎటాక్ లక్షణాలు ఏమిటి?

సాధారణంగా గుండెకు నిరంతరం ఆక్సీజన్ తో కూడిన రక్తం సరఫరా అవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా గుండెనొప్పి వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల గుండెకు ఆక్సిజన్‌తో కూడిన రక్త సరఫరా ఆగిపోవచ్చు.

హార్ట్ అటాక్‌కు ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. అవి ఏమిటంటే. . ముఖ్యంగా చాతిలో కొద్దిగా నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది - వాంతులు - తీవ్రమైన తలనొప్పి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు చాలా మంది గుండె పోటు వచ్చిన గంట తర్వాత ఆస్పత్రికి వస్తున్నారని దీనివల్ల చాలా నష్టం జరుగుతున్నదని వైద్యులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఆస్పత్రికి తీసుకొస్తే పేషెంట్ బతికే చాన్స్ ఎక్కువగా ఉంటుందట.  అందువల్ల గుండె పోటు వచ్చిన పేషేంట్లకు మొదటి గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారు.

గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి

తరుచూ వ్యాయామం చేయడం - మద్యపానం ధూమపానం చేయకపోవడం - నిరంతరం వ్యాయామం చేయడం తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం - వేళకు నిద్రకు పోవడం - ఒత్తిడికి దూరంగా ఉండటం వంటి వాటితో గుండెపోటుకు దూరంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.