గుండెపోటుతో 13 ఏళ్ల తెలంగాణ బాలిక మృతి

Sat Apr 01 2023 18:12:27 GMT+0530 (India Standard Time)

Heart attack at the age of 13.. Girl dies

ఇప్పుడు కాదు ఎవరికి గుండెపోటు అన్నట్టుగా మారింది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారికే ఈ గుండెపోటు వచ్చేది. ఇప్పుడు యువకులు మధ్య వయస్కులే కాదు.. ఆఖరుకు పిల్లలకు కూడా ఈ గుండెపోట్లు వచ్చి కుప్పకూలి చనిపోతున్న పరిస్తితి నెలకొంది.  ఈ రోజుల్లో యువ జనాభాలో గుండెపోటు మరణాలు చాలా సాధారణం అయ్యాయి.తెలంగాణకు చెందిన 13 ఏళ్ల బాలికకు ఇలానే గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదం నింపింది.తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన  స్రవంతి అనే  13 ఏళ్ల బాలిక ఊపిరి పీల్చుకోలేక పోవడంతో కుటుంబ సభ్యులు స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలిక మృత్యువాత పడడంతో ఆ కుటుంబం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది.

శ్రీరామ నవమికి సెలవు ఉండడంతో గురువారం సాయంత్రం ఇంటివద్ద తోటిపిల్లలతో కలిసి స్రవంతి ఆడుకుంది. గ్రామానికి కొద్ది దూరంలో నిర్మిస్తున్న కొత్త ఇంటి వద్ద రాత్రి నిద్రించేందుకు తల్లిదండ్రులు వెళ్లగా బాలిక తన నానమ్మతో కలిసి పాత ఇంటి వద్ద నిద్రకు ఉపక్రమించింది.

తెల్లవారుజామున 3గంటల సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందని నానమ్మకు చెప్పింది. తర్వాత మూత్ర విసర్జనకు బయటకు వెళ్లి వచ్చి పడుతుంది. తర్వాత కొద్దిసేపటికే ఆయాస పడుతూ నానమ్మను పిలిచింది.

బాలిక బాబాయ్ వచ్చి సీపీఆర్ చేసి వెంటనే ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందిందని తెలిపాడు. అయితే ఆశ చావని తల్లిదండ్రులు ఖమ్మంలోని మరో ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. స్రవంతి అకాల మరణం ఆ తండాలో విషాదం నింపింది.

స్రవంతి ఆరో తరగతి చదువుతోంది. చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురై మరణించింది. యువ తరంలో గుండెపోటుల పరంపర ఇప్పుడు చాలా ఆందోళనకరంగా మారింది. ఇలాంటి ఘటనలను పరిశీలించి మూలకారణాన్ని గుర్తించాలని  సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.