23లోపు నేతలు - ప్రజలు చేయాల్సిందిదే..

Sun May 19 2019 12:09:56 GMT+0530 (IST)

Health Tips During Elections Results

పోలింగ్ కు.. ఫలితాలకు మధ్య 45 రోజుల సమయం.. సాధారణ ప్రజలే కాదు.. నాయకులు కూడా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వస్తోంది. 23న ఫలితాలు.. అంతకుముందే నేత భవిష్యత్ ను అంచనా  వేసే ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. మే 19 అంటే ఈరోజు సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలవుతుంది. దీంతో ప్రజలు - నేతలు ఫలితాలు అనుకూలంగా వచ్చినా.. వ్యతిరేకంగా వచ్చిన కంగారు పడకండి.. అనవసరంగా అనారోగ్యాలు కొనితెచ్చుకోకండి..ముఖ్యంగా నేతలు ఈ ఎగ్జిట్ పోల్స్ నే నిజమైన ఫలితాలు అనుకొని బీపీ పెంచుకొని ఆస్పత్రుల పాలయ్యే అవకాశాలున్నాయి. ఇక లక్షలు - కోట్లు బెట్టింగ్ కాసిన బెట్టింగ్ రాయుళ్లు కూడా ఎగ్జిట్ పోల్స్ ను నిజమనుకొని నిండా మునిగామని బాధపడితే గుండెపోటు సహా వివిధ రోగాలు అల్లుకుంటాయి. అందుకే మే 23వరకు ఆగితే బెటర్ అంటున్నారు వైద్యులు.. నెటిజన్లు..

సోషల్ మీడియా సర్క్యూలేట్ అవుతున్న ఓ మేసేజ్ అందరినీ ఆకర్షిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రారంభమయ్యే మే 19 నుంచి మే 23దాకా నేతలు - సామాన్య ప్రజలు హైరానా పడకుండా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు అంటూ ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. మాత్రలు వెంట ఉంచుకోవాలని.. బంధువులను పక్కనే ఉండేలా చూసుకోవాలని.. సర్వేలను నమ్మి బీపీ పెంచుకోవద్దని.. ఫలితాలు - ఎగ్జిట్ పోల్స్ వేళ తీవ్ర ఒత్తిడికి గురికావద్దని విశ్లేషిస్తున్నారు. ఈ జాగ్రత్తలు అన్ని తీసుకోకుంటే ఆరోగ్య పరంగా తీవ్ర నష్టం తప్పదని ఆ మేసేజ్ సూచిస్తోంది.

వినడానికి కాస్త సరదాగా ఉన్నా.. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఈ మేసేజ్ ఆసక్తి రేపుతోంది. నిజానికి గెలుపు ఓటములున్నది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం. ప్రజలందరికీ రాజకీయం అవసరమే కానీ.. తమకు నచ్చిన పార్టీ - నేతలు ఓడిపోయారని బీపీ పెంచుకుంటే మీ పుట్టియే మునిగుతుంది. అందుకే గెలుపు ఓటములను సహజంగా తీసుకోండి.. ఎగ్జిట్ పోల్స్ - ఫలితాలను ఎంజాయ్ చేయండి..కానీ జీవితానికి అన్వయించుకుంటే మీ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది.

+ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ఇదే..

మే 19 - 23 కు మధ్య తేదీలలో పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు :

1. టిఫిన్ చెయ్యడానికి ముందు - చేసిన తరువాత వేసుకోవలసిన బీపీ- షుగర్ మాత్రలు వేసేసుకోండి

2 . సార్బిట్రేట్ మాత్రలు దగ్గర పెట్టుకోండి .

3 . దగ్గరగా మంచినీళ్ళ సీసా ఉంచుకోండి .

4 . దగ్గర బంధువుల - మిత్రుల ఫోన్ నంబర్ లు ఒక కాగితం మీద రాసి పెట్టుకోండి.

5 . అంబులన్స్ నెంబర్ లు కూడా సేకరించి పెట్టుకోండి .

7. వార్తలపై పక్కవారితో వ్యాఖ్యానించకండి .

6 . దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ ఉండండి.

7. ఏసీ వేసుకోండి .

8. కాఫీ ఫ్లాస్క్ లో పోసుకుని ఉండండి .

9 . టి . వి . వాల్యూం తక్కువగా పెట్టండి . దగ్గర బంధువుల - మిత్రుల తో కలిసి టి. వి . చూడండి.

10. వేరే పార్టీల వారితో కలిసి టి. వి. చూడకండి

11 . మధ్య మధ్యలో ఛానల్ మార్చి సినిమా పాటలు వినండి.

12. కమర్షియల్ బ్రేక్స్ సమయం లో చానల్ మార్చకుండా ఆ ప్రకటనల గురించి ఆలోచించండి
.
13. ఆ సమయం లో శీతలీ - శీత్కారీ ప్రాణాయామాలు చేసి హాస్యాసనం వెయ్యండి

( అంటే దిక్కులు పిక్కటిల్లెట్టు నవ్వండి. తలుపులు వేసెయ్యండి )

14. మీకు మీరు చెప్పుకుంటూ ఉండండి. ఎవరు నెగ్గినా ఎవరు ఓడినా మీ ఇంట్లో నెగ్గేది మీరు కాదు

అని మీకు తెలిసిన విషయాన్ని పదేపదే గుర్తు చేసుకుంటూ ఉండండి .

15 . వ్యతిరేక పార్టీల వారికి ట్యాగ్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ లు వాట్సప్ మెసేజ్ లు పెట్టకండి.

16. వస్తున్న బూతులు మింగుతూ ఉండండి . అనులోమ విలోమ ప్రాణాయామం వలన వాటిని మింగ గలుగుతారు.