Begin typing your search above and press return to search.

శృంగారంతో మహిళలకు కలిగే లాభమిదేనట..

By:  Tupaki Desk   |   18 Jan 2020 1:30 AM GMT
శృంగారంతో మహిళలకు కలిగే లాభమిదేనట..
X
శృంగారం.. దివ్యౌషధం అని ఎన్నో పరిశోధనల్లో తేలింది. మగాళ్లకు చచ్చేవరకూ కోరికలు, స్తంభనలు ఉంటాయి.. కానీ మహిళలకు మాత్రం మోనోపాజ్ వస్తే శృంగార కోరికలు తగ్గిపోతాయి. రుతుస్రావం ఆగిపోయే దశ అయిన మోనోపాజ్ సాధారణంగా 40-50 ఏళ్ల మధ్య మహిళలకు వస్తుంది. కానీ ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానంతో మహిళల్లో 40 ఏళ్లకు ముందుగానే మోనోపాజ్ వస్తుంది.

అయితే మోనోపాజ్ తో మహిళలకు శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది. మునుపటిలా భర్తతో సెక్స్ ను ఎంజాయ్ చేయలేరు. కలయిక బాధాకరంగా.. నొప్పిగా మహిళలను బాధిస్తోంది. తమ పని అయిపోయిందని బాధపడుతుంటారు. తాము ఇక సంసారానికి పనికి రామని భావిస్తారు. కానీ తాజాగా లండన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త విషయం కనుగొన్నారు.

తరచూ శృంగారంలో పాల్గొనే వారిలో మోనోపాజ్ దశ కాస్త ఆలస్యంగా వస్తుందని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శృంగారానికి దూరంగా ఉండే మహిళలతో పోలిస్తే తరచూ శృంగారంలో పాల్గొనే మహిళల్లో మోనోపాజ్ కాస్తా ఆలస్యంగా వస్తుందని పరిశోధకులు తేల్చారు.

కనీసం వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనడం ద్వారా మోనోపాజ్ వచ్చే అవకాశాలు 28శాతం తగ్గుతాయని లండన్ పరిశోధకులు తేల్చారు. 1996-97 నుంచి దాదాపు 3వేల మంది మహిళలపై దశాబ్ధకాలం పాటు పరిశోధించి ఈ విషయం తేల్చారు. తరచూ సెక్స్ చేసే మహిళల్లో 52 ఏళ్లకు మోనోపాజ్ రాగా.. సెక్స్ చేయని వారిలో 45 ఏళ్లకే మోనోపాజ్ వచ్చేసింది.