Begin typing your search above and press return to search.

శృంగారమే దివ్యౌషధం.. రోగనిరోధక శక్తికి ఊతం

By:  Tupaki Desk   |   7 Feb 2023 5:00 AM GMT
శృంగారమే దివ్యౌషధం.. రోగనిరోధక శక్తికి ఊతం
X
శృంగారమే దివ్యౌషధం అని ఎన్నో పరిశోధనల్లో తేలింది. అది చేస్తే మీ భావి జీవితం ప్రస్తుతం జీవితం ఆనందమయంగా ఉండడమే కాదు.. అనారోగ్యాలను దూరం చేస్తుందని తేలింది. మానవ జీవితంలో శృంగారం అనేది ఒక నిత్యావసరం.. సృష్టి మనుగడకు మూలాధారం. శృంగారం అంటే కేవలం సుఖం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా అని వైద్యులు చెబుతున్నారు. చక్కని దాంపత్యానికి శృంగారం ఔషధంలా పనిచేస్తుందంటారు. క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొంటే మంచి దీర్ఘాయుష్షు కూడా కలుగుతుందని నిర్దారణ అయింది. సెక్స్ తో గాఢమైన నిద్ర, ఒత్తిడి నుంచి ఉపశమనం, ఒంట్లోని క్యాలరీలు ఖర్చు అవడం మాత్రమే కాదు ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే క్రమం తప్పకుండా సెక్స్ చేయాలని సూచిస్తున్నారు.

వారానికి ఒకటిరెండు సార్లు శృంగారంలో పాల్గొంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా రెండు సార్లు సెక్స్ చేసేవారికి మిగతా వారితో పోల్చితే గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. శృంగారం కారణంగా గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల రక్తప్రసరణలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. రక్తంలోని టాక్సిన్స్ కూడా తొలగి రక్తం శుభ్రం అవుతుంది.

తరచూ శృంగారంలో పాల్గొంటే రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. వారానికి ఒకటి కన్నా తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే వారానికి ఒకటిరెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారి లాలాజలంలో ఇమ్యూనోగ్లోబులిన్ ఏ (ఐజీఏ) మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్టు వైక్స్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.

రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఐజీఏ కీలక పాత్ర పోషిస్తుంది. మరి సహజంగా శృంగార జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? వ్యాయామం వాటితో పాటు తిండి మీద కాస్త శ్రద్ద పెట్టాలి.

శృంగారంతో జీవితకాలం 20 ఏళ్ల వరకూ పొడిగించవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరణించే ముప్పును సగానికి తగ్గించొచ్చని మరికొన్ని సూచిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. శృంగారమనేది భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతం. ఆత్మీయ సంబంధంతో మానసిక బలమూ ఇనుమడిస్తుంది. ఫలితంగా కుంగుబాటు, దిగులు దరిచేరవు. శృంగారం వ్యాయామంగానూ ఉపకరిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందన్న సంగతి తెలిసిందే.

సోయా, చేపల వంటివి సెక్స్ హార్మోన్ల మోతాదులు పెరిగేలా చేస్తాయి. పలుచటి ప్రోటీన్లతో కూడిన కోడిమాంసం వంటి వాటిల్లో టైరోసైన్, ఫినైల్ అలనైన్ ఉంటాయి. ఇవి శృంగార ఆసక్తిని పెరిగేలా చేస్తాయి. తక్కువ కొవ్వు గల పెరుగు, గుడ్ల వంటి వాటిల్లో కొలైన్ ఉంటుంది. శృంగార కాంక్షను నియంత్రించే రసాయనానికి మందు రూపం ఇదే.

పొట్టు తీయని ధాన్యాలు, ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో గ్లుటమైన్, ఐనోసిటాల్ ఉంటాయి. భావప్రాప్తికి చేరుకునే దశలో స్థిమితంగా ఉండడానికి తోడ్పడే రసాయనం వీటి నుంచే పుట్టుకొస్తోంది. ఇలా శృంగారంతో జీవితకాలం పెరుగుతుందట..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.